Home > క్రీడలు > James Anderson : 41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. భారత్లో టెస్ట్ క్రికెట్ ఆడిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డ్

James Anderson : 41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. భారత్లో టెస్ట్ క్రికెట్ ఆడిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డ్

James Anderson : 41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. భారత్లో టెస్ట్ క్రికెట్ ఆడిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డ్
X

(James Anderson) ఏజ్ నాట్ ఎ మ్యాటర్.. అని ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మరోసారి నిరూపించాడు. ఒక దానిపై ప్యాషన్ ఉంటే.. అసాధ్యం కానిది ఏది లేదని ప్రూవ్ చేశాడు. 41 ఏళ్ల వయసులో.. ఓ పేస్ బౌలర్ ఫిట్ నెస్ ను కొనసాగిస్తూ అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగడమనేది చాలా అరుదు. ప్రస్తుతం క్రికెట్ లో ఉన్న పోటీ, పరిస్థితులకు ఏ ప్లేయర్ కైనా అది అసాధ్యం. కానీ ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మాత్రం 41 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే అంటున్నాడు. 2003లో టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేసిన అండర్సన్.. తనకు ఇదంతా సాధారణ విషయం అని చెప్తున్నాడు. వయసు మీద పడుతున్నా.. పట్టు తగ్గని బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు.





రెండో టెస్టులో ఇంగ్లాండ్ బౌలింగ్ దాడిని ప్రారంభించిన అండర్సన్.. ఇన్ స్వింగ్, ఔట్ స్వింగర్లతో భారత్ ను ముప్పు తిప్పలు పెట్టాడు. ఆరు నెలల తర్వాత టెస్టులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేశాడు. తొలి స్పెల్ లోనే 5 ఓవర్లు వేసి 6 పరుగులు ఇచ్చాడు. అందులో ఒక మెయిడెన్ ఓవర్ ఉంది. తర్వాత స్పెల్ లో జోరందుకుని.. గిల్ వికెట్ పడగొట్టాడు. ఈ వికెట్ తో వరుసగా 22వ ఏడాది అండర్సన్ టెస్ట్ వికెట్ సాధించాడు. కాగా భారత్ లో టెస్ట్ మ్యాచ్ ఆడిన అతిపెద్ద వయసు (41 ఏళ్ల 187 రోజులు) పేస్ బౌలర్ అతనే కావడం విశేషం. ఓవరాల్ గా టెస్ట్ క్రికెట్ ఆడుతున్న అయిదో అతిపెద్ద వయస్కుడు అండర్సనే. కాగా గిల్.. అండర్సన్ ను బౌలింగ్ ను 7 ఇన్నింగ్స్ ల్లో ఎదుర్కోగా.. 5 సార్లు ఔట్ అయ్యాడు.






Updated : 3 Feb 2024 11:36 AM IST
Tags:    
Next Story
Share it
Top