Home > క్రీడలు > తండ్రైన బుమ్రా.. కొడుకుకు ఏం పేరు పెట్టారంటే..?

తండ్రైన బుమ్రా.. కొడుకుకు ఏం పేరు పెట్టారంటే..?

తండ్రైన బుమ్రా.. కొడుకుకు ఏం పేరు పెట్టారంటే..?
X

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా నాన్న అయ్యాడు. ఆయన భార్య సంజనా గణేశన్‌ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో చెప్పారు. బాబు చెయి పట్టుకుని దిగిన ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.

‘‘మా చిన్న కుటుంబం పెద్దగా అయ్యింది. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. ఈ రోజు ఉదయం లిటిల్ బాయ్ అంగద్‌ జస్ప్రీత్‌ బుమ్రాను ప్రపంచంలోకి ఆహ్వానించాం. ప్రస్తుతం మా సంతోషానికి అవధుల్లేవు. మా జీవితంలోని ఈ కొత్త అధ్యాయాన్ని ప్రతిక్షణం ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నాం’’ అని బుమ్రా రాసుకొచ్చాడు. ఇక 2021లో బుమ్రా - సంజనా గణేశన్‌ వివాహం జరిగింది.





బుమ్రా దంపతులకు పలువురు సెలబ్రిటీలు స్పెషల్ విషెస్ చెబుతున్నారు. క్రికెటర్లు సూర్య కుమార్‌ యాదవ్‌, దినేశ్‌ కార్తిక్‌, రోహిత్‌ శర్మ సతీమణి రితికా, యువరాజ్‌ సతీమణి హజెల్‌ సహా పలువురు బుమ్రాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమయంలో తన భార్య పక్కన ఉండాలనే ఉద్ధేశ్యంతో బుమ్రా ఇండియాకు తిరిగొచ్చాడు. ఆసియాకప్లో భాగంగా ఇవాళ జరగనున్న భారత్ - నేపాల్ మ్యాచ్ కు అతడు అందుబాటులో అండడు.








Updated : 4 Sept 2023 12:28 PM IST
Tags:    
Next Story
Share it
Top