ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్స్ కు వెళ్ళిన నీరజ్ చోప్రా
X
బల్లెం విసిరాడంటే మెడల్స్ వచ్చిపడాల్సిందే. ఎంతెంత దూరాలైనా అతని త్రోకి దగ్గర అవ్వాల్సిందే. అతనే భారత జావెలిన్ త్రో ఛాంపియన్ నీరజ్ చోప్రా. తనకొచ్చిన మెడల్స్ తో భారత్ ను టాప్ లో నిలబెట్టిన ఇతను మరో అదిరిపోయే ప్రదర్శనతో సంచలనం సృష్టించాడు.
హంగేరీలో జరుగుతున్న ప్రపంచ అధ్లెటిక్స్ చాంఫియన్ షిప్స్ లో నీరజ్ చోప్పా అద్భుతం చేశాడు. క్వాలిఫయర్స్ మొదటి ప్రయత్నలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన డైరెక్ట్ గా ఫైనల్స్ లోకి దూసుకెళ్ళాడు. క్వాలిఫైయింగ్ గ్రూప్ ఏలో పోటీ పడిన నీరజ్ 88.77 మీటర్లు జావెలిన్ ను విసిరాడు. ఫైనల్ కటాఫ్ 83 మీటర్ల కన్నా ఎక్కువ దూరం విసరడంతో డైరెక్ట్ గా ఫైనల్ కు వెళ్ళిపోయాడు. ఈ ఆది వారం ఫైనల్స్ జరగనున్నాయి.
నీరజ్ చోప్రా ఫైనల్స్ లోకి దూసుకెళ్ళడమే కాదు నెక్స్ట్ ఇయర్ జరగబోయే పారిస్ ఒలింపిక్స్ కీ అర్హత సాధించాడు. ఇక నీరజ్ చోప్రా తో పాటూ మరో భారత్ జావెలిన్ త్రో మను కూడా ఉత్తమ పదర్శన కనబరిచాడు. మొదటి రౌండ్ లో 78.10 మీటర్లు విసరగా....రెండో ప్రయత్నంలో 81.31 మీటర్లు విసిరాడు.