బెయిర్‌స్టో ఔట్...ఆసీస్‌కు అశ్విన్ సపోర్ట్..
X
యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో వివాదస్పద ఔట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ ముగిసి మూడు-నాలుగు రోజులు అవతున్నా ఇంకా దీనిపై చర్చ నడుస్తోంది. అసీస్ తీరును పలువురు విమర్శిస్తుంటే..మరికొందరు మాజీలు, ఆటగాళ్లు మాత్రం కంగారులకు మద్దతు పలుకుతున్నారు. తాజాగా బెయిర్ స్టో ఔట్‌పై భారత్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ స్పందించాడు.
అలెక్స్ కేరీ, ఆసీస్ జట్టుపై విమర్శలు చేస్తున్న వారిపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అలెక్స్ కేరీ చేసిన దాంట్లో తప్పేమి లేదని, ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం కాదంటూ వ్యాఖ్యానించాడు. " ఓ బ్యాటర్ ఒవర్ ముగియగానే కీపర్ లేదా స్లిప్ ఫీల్డర్ పర్మిషన్ తీసుకోవాలి. లేకపోతే అంపైర్ సిగ్నల్ ఇచ్చాక క్రీజ్ దాటాలి. కానీ బెయిర్ స్టో అలా చేయలేదు. ఓవర్ చివరి బంతిని వదిలేసిన తర్వాత నాన్‌స్ట్రైకర్‌తో మాట్లాడేందుకు బెయిర్‌స్టో ముందుకొచ్చాడు. అదే సమయంలో ఏమాత్రం వేచి చూడకుండా అలెక్స్ కేరీ బంతిని వికెట్ల మీదకు విసిరాడు. బెయిర్‌స్టో అలా ముందుకెళ్తాడని కేరీకి తెలుసు కాబట్టే స్టంప్స్‌ను పడగొట్టాడు. బెయిర్ స్టో మాత్రం సింగిల్ తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో పెద్ద చర్చకు దారి తీసింది" అని అశ్విన్ తెలిపాడు. ఈ అంశంలో మరోసారి క్రీడాస్ఫూర్తిపై మాటలు వినిపించాయిని..ఇదేంటో నాకైతే అర్థం కాలేదని అశ్విన్ తెలిపాడు. అది నిబంధనలకు లోబడే జరిగింది..అందుకే, అలెక్స్ కేరీ చేసినదాంట్లో నాకేమీ తప్పు కనిపించడం లేదని అశ్విన్ వివరించాడు.