యాషెస్‌లో గందరగోళం.. గ్రౌండ్లోకి దూసుకొచ్చి నిరసన
X
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తొలి రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే గ్రౌండ్ లోకి నిరసన కారులు దూసుకొచ్చారు. దాంతో అంపైర్లు ఆటను కొంతసేపు నిలిపివేశారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ మొదలైన తొలి ఓవర్ లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ‘జస్ట్ స్టాప్ ఆయిల్ గ్రూప్’కు చెందిన కొందరు నిరసన కారులు ఆరెంజ్ కలర్ పౌడర్ చల్లుతూ నిరసన తెలిపారు. కొంతసేపటికి సెక్యూరిటీ కళ్లుగప్పి.. గ్రౌండ్ లోకి చొరబడ్డారు. పిచ్ వైపు దూసుకెళ్తూ నినాదాలు చేశారు. గ్రౌండ్ అంతా ఆరెంజ్ కలర్ పౌడర్ చల్లే ప్రయత్నం చేశారు.
అంతలో తేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంగ్లండ్ ప్లేయర్ బెయిస్ట్రో.. ఓ నిరసన కారుడిని అమాంతం ఎత్తుకుని... గ్రౌండ్ బయటికి తీసుకెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెయిర్‌స్టో చేసిన ఈ పనిని పలువురు మెచ్చుకున్నారు. ఈ వీడియోపై స్పందించిన రవిచంద్రన్ అశ్విన్.. ‘బెయిర్ స్ట్రో హెవీ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ మొదలుపెట్టాడ’ని కామెంట్ పెట్టాడు.
‘జస్ట్ స్టాప్ ఆయిల్ గ్రూప్’.. కొత్త ఇంధన లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా గవర్నమెంట్, నిరసన కారులకు చర్చలు నడుస్తున్నా ఫలించడంలేదు. ఈ క్రమంలో ఛాన్స్ దొరికిన ప్రతిసారీ నిరసనకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Bairstow picking up a pitch invader#Ashes pic.twitter.com/vCWCkXb3IA
— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 28, 2023