Mohammad Azharuddin : అజహరుద్దీన్కు షాక్.. ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు
X
టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్కు భారీ షాక్ తగిలింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. (HCA)ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు పడింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతంలో అజహరుద్దీన్ ఏకకాలంలో హెచ్‌సీఏ తో పాటు డెక్కన్ బ్లూస్ క్లబ్ ప్రెసిడెంట్గా వ్యవహరించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉండి నిబంధనలు ఉల్లంఘించినందుకు కమిటీ ఆయనపై వేటు వేసింది. ఈ మేరకు హెచ్‌సీఏ ఓటరు లిస్టు నుంచి అజహరుద్దీన్ పేరును తొలగించింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇటీవలే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 20న ఎలక్షన్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్స్ పోస్టులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 14న వాటి స్క్రూటినీ జరగనుంది. అక్టోబర్ 16 వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడవు ఇచ్చారు. అక్టోబర్ 20న ఎన్నిక నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.