Home > క్రీడలు > హెచ్‌సీఏకు బిగ్ షాక్‌.. 57 క్లబ్లపై వేటు

హెచ్‌సీఏకు బిగ్ షాక్‌.. 57 క్లబ్లపై వేటు

హెచ్‌సీఏకు బిగ్ షాక్‌.. 57 క్లబ్లపై వేటు
X

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు బిగ్ షాక్ తగిలింది. 57 క్లబ్లపై సుప్రీం నియమించిన కమిటీ వేటు వేసింది. హెచ్‌సీఏ ఎన్నికల్లో మూడేళ్ల పాటు పోటీ చేయకుండా ఆయా క్లబ్‌లు, వాటి ఎగ్జిక్యూటివ్‌ కమిటీలపై నిషేధం విధించారు. 80 క్లబ్‌లను తమ అధీనంలో పెట్టుకున్న 12 మంది సహా వారి కుటుంబ సభ్యులు హెచ్‌సీఏ ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నట్లు కమిటీ గుర్తించింది.

కొందరు వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ క్లబ్లు కలిగి ఉండడాన్ని కమిటీ గుర్తించింది. జీహెచ్ఎంసీకి చెందిన 21 క్లబ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు తేల్చింది. దీంతో మొత్తం 57 క్లబ్లపై వేటు వేసింది. ఈ వేటుతో ఆ క్లబ్‌లు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీల్లో ఉన్నవాళ్లు ఓటు హక్కును వినియోగించుకోలేరు. ఈ క్రమంలో హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శితో సహా అత్యున్నత పదవులపై ఆశలు పెట్టుకున్న చాలామంది రానున్న ఎన్నికలకు దూరమయ్యారు.

మొత్తం 215 క్లబ్‌లకు గానూ 158 మాత్రమే హెచ్‌సీఏ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోన్నాయి. ఈ మేరకు జస్టిస్ లావు నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్‌సీఏ అపెక్స్‌ కమిటీకి నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఈ ఏడాది ఫిబ్రవరి 14న జస్టిస్‌ నాగేశ్వరరావు కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. అంతకుముందు సుప్రీంకోర్టు నియమించిన పర్యవేక్షక కమిటీ నివేదికను జస్టిస్ నాగేశ్వరరావు కమిటీ పరిగణలోకి తీసుకుంది.



Updated : 1 Aug 2023 10:04 AM IST
Tags:    
Next Story
Share it
Top