సౌతాఫ్రికా బౌలింగ్ కు చేతులెత్తుస్తోన్న టీమిండియా.. ఒక్కరంటే ఒక్కరు కూడా..!
X
సెంచూరియన్ వేదికగా.. భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా బౌలర్లు రెచ్చిపోతున్నారు. మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ప్రొటీస్ బౌలర్ల దెబ్బకు ఒక్కరంటే ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోతున్నారు. కగిసో రబాడ్.. నిప్పులు చెరుగుతూ భారత కీలక 4 వికెట్లు పడగొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (5, 14 బంతుల్లో), యశస్వీ జైశ్వాల్ (17, 37 బంతుల్లో) ఫెయిల్ అయ్యారు. ఘనంగా ఆరంభిస్తారనుకున్న సిరీస్.. మొదట్లోనే ఔట్ అయి నిరాశ పరిచారు. దీంతో టీమిండియా 23 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. శుభ్ మన్ గిల్ (2, 12 బంతుల్లో) కూడా ఫెయిల్ అయ్యాడు.
నాలుగో వికెట్ లో వచ్చిన విరాట్ కోహ్లీ (38, 64 బంతుల్లో), ఐదో వికెట్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (31, 50 బంతుల్లో) కాసేపు ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. లంచ్ బ్రేక్ తర్వాత ఇద్దరూ వెంట వెంటనే ఔట్ అయ్యేసరికి టీమిండియాపై కోలుకోలేని దెబ్బ పడింది. అశ్విన్ (8, 11 బంతుల్లో) కూడా త్వరగానే ఔట్ అయ్యాడు. కాగా మిడిల్ ఆర్డర్ లో వచ్చిన కేఎల్ రాహుల్ (23 నాటౌట్), శార్దూల్ ఠాకూర్ (23 నాటౌట్) ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం (44 ఓవర్లకు) టీమిండియా స్కోరు 157/6 గా ఉంది. వికెట్ల వరద ఆగకపోతే.. ఇవాళే సౌతాఫ్రికా బ్యాటింగ్ కు దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.