Home > క్రీడలు > కివీస్కు మంచిరోజులొచ్చాయ్.. టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌

కివీస్కు మంచిరోజులొచ్చాయ్.. టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌

కివీస్కు మంచిరోజులొచ్చాయ్.. టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌
X

వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న న్యూజిలాండ్ జట్టుకు మంచిరోజులొచ్చాయి. వరుస ఓటములతో సెమీస్ అవకాశాలు సన్నగిల్లుతున్న కివీస్ కు ఇదో గుడ్ న్యూస్. టోర్నీ ఆరంభంలో గాయం కారణంగా జట్టుకు దూరం అయిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తిరిగి జట్టులో చేరాడు. కీలక సమయంలో గాయం నుంచి కోలుకుని జట్టు పగ్గాలు చేపట్టాడు. బెంగళూరు వేదికగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. విలియమ్సన్ ఎంట్రీతో కివీస్ బలం పెరిగింది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకమే. గెలిచిన జట్టు సెమీస్ రేసులో నిలుస్తుంది. కివీస్ గెలిస్తే.. పాక్ తో పాటు, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఆప్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు ఇంటి ముఖం పడతాయి. కాగా ప్రస్తుతం కివీస్ కుదురుగా ఆడుతుంది. 12 ఓవర్లలో 70 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డేవోన్ కాన్వే (35) పరవాలేదనిపించి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రచిన్ రవిచంద్ర (29), విలియమ్సన్ (5) ఉన్నారు. పాక్ బౌలర్ హసన్ అలి కాన్వే వికెట్ పడగొట్టాడు.

తుది జట్లు:

న్యూజిలాండ్‌: డేవన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్‌, మార్క్‌ చాప్‌మన్, మిచెల్ శాంట్నర్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్

పాకిస్థాన్‌: అబ్దుల్లా షఫీక్, ఫకర్ జమాన్, బాబర్ అజామ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తికార్ అహ్మద్, సౌద్ షకీల్, అఘా సల్మాన్, షహీన్‌ అఫ్రిది, హసన్ అలీ, మహమ్మద్‌ వాసిమ్‌ జూనియర్‌, హారిస్ రవూఫ్

Updated : 4 Nov 2023 11:28 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top