Kane Williamson : కేన్ విలియమ్సన్ వీరబాదుడు.. టెస్టుల్లో సరికొత్త రికార్డు
X
టెస్టు క్రికెట్ లో ఒక సెంచరీ కొట్టాలంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వరుస మ్యాచుల్లో సెంచరీలు చేయడం అంటే కాస్త అసాధ్యమైన విషయమే. కానీ, నాకు కాదు అంటున్నాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. ఒకటికాదు రెండు కాదు.. వరుసగా ఏడు మ్యాచుల్లో ఏడు సెంచరీలు చేసి ఆల్ టైం రికార్డ్ నెలకొల్పాడు. ఫ్యాబ్ 4లో ఒకడైన కేన్..టెస్టు క్రికెట్‌లో తానొక దిగ్గజం అని చాటిచెప్పుకున్నాడు. వరుసగా శతకాల మీద శతకాలు బాదేస్తున్నాడు. న్యూజిలాండ్ లో సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ కొట్టిన విలియమ్సన్.. స్టీవ్ స్మిత్ రికార్డును సమం చేశాడు.
ఇప్పటివరకు 172 ఇన్నింగ్స్ ల్లో 32 సెంచరీలు చేసిన విలియమ్సన్ అత్యంత వేగంగా 32 సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. అయితే స్మిత్ 174 ఇన్నింగ్స్ ల్లో 32 సెంచరీలు చేశాడు. ఆ తర్వాత స్థానంలో రికీ పాంటింగ్ (176), క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (179) ఉన్నారు. కాగా ఇప్పటి వరకు వరుసగా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డ్ పాకిస్తాన్ బ్యాటర్ యూనిస్ ఖాన్ (5)పై ఉంది. కాగా ఈ మ్యాచ్ తో కేన్ ఆ రికార్డును కూడా చెరిపేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ విజయం దిశగా దూసుకుపోతుంది. కేన్ సెంచరీతో గెలుపు దాదాపు ఖరారైంది. మరో 42 పరుగులు చేస్తే.. న్యూజిలాండ్ గెలిచి సిరీస్ ను 2-0తో సొంతం చేసుకుంటుంది.