ICC Worldcup 2023: కివీస్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా..
X
వన్డే ప్రపంచకప్ సమరం మొదలయింది. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లు మొదటి ఓవర్ నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అయినా ఇంగ్లండ్ 282 పరుగుల భారీ స్కోర్ చేసింది. జో రూట్ (77) హాఫ్ సెంచరీ సాధించగా.. జోస్ బట్లర్ 43, జానీ బెయిర్‌స్టో 33, డేవిడ్ మలన్ 14, హ్యారీ బ్రూక్ 25, మొయిన్ అలీ 11, లియామ్ లివింగ్ స్టోన్ 20 పరుగులు చేశారు. సామ్ కరన్ 14, క్రిస్ వోక్స్11, అడిల్ రషిద్ 15, మార్క్ ఉడ్ 13 తమ వంతు కృషి చేశారు. కివీస్ బౌలర్ల దాటిని కాస్త తట్టుకున్నారు. మధ్యలో కాస్త నెమ్మదించిన కివీస్ బౌలర్లు తర్వాత పుంజుకున్నారు. పార్ట్ టైం బౌలర్ గ్లెన్ ఫిలిప్స్ 2 రాణించాడు. మ్యాట్ హెన్రీ 3, మిచెల్ సాంట్నర్ 3 వికెట్లు పడగొట్టారు. పొదుపుగా బౌలింగ్ చేసిన ట్రెంట్ బౌల్ట్ 1 వికెట్ పడగొట్టాడు. రచిన్ రవీంద్ర కూడా 1 వికెట్ దక్కింది.