Home > క్రీడలు > ICC Worldcup 2023: కేన్ మామ ఏంట్రీ.. భారీ స్కోర్ను ఊదేసిన న్యూజిలాండ్

ICC Worldcup 2023: కేన్ మామ ఏంట్రీ.. భారీ స్కోర్ను ఊదేసిన న్యూజిలాండ్

ICC Worldcup 2023: కేన్ మామ ఏంట్రీ.. భారీ స్కోర్ను ఊదేసిన న్యూజిలాండ్
X

వస్తున్నరు.. కొడుతున్నరు.. వెళ్తున్నరు.. పాకిస్తాన్ బౌలర్లపై ఓకటే మ్యూజిక్. మొత్తంగా చెప్పాలంటే.. పాక్ బౌలర్లను ఓ రేంజ్ లో చితక్కొట్టారనుకోండి. వరల్డ్ కప్ వార్మప్ మ్యాచుల్లో భాగంగా.. హైదరాబాద్ లో పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాక్.. భారీ స్కోర్ చేయగా న్యూజిలాండ్ దాన్ని 44 ఓవర్లలో ఊది పారేసింది. ప్రతీ కివీస్ బ్యాటర్ క్రీజులోకి వచ్చి.. టీ20ల్లో ఆడినట్లు సిక్సర్లు ఫోర్లు కొట్టి హాఫ్ సెంచరీ సాధించి రిటైర్డ్ హర్ట్ గా వెళ్లిపోతున్నారు. అదే రిపీట్ అయింది. దాంతో పాక్ బౌలర్లు చేతులెత్తేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం (80), రిజ్వాన్ (103), షకీల్ (75) పరుగులు చేశారు. మాట్ హెన్రీ, నీషమ్, ఫెర్గుసన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. సాంట్నర్ కు రెండు వికెట్లు దక్కాయి.

346 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 43.4 ఓవర్లలోనే టార్గెట్ ను ఊది పారేసింది. ప్రతీ బ్యాట్స్ మెన్ సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఓపెనర్ రచిన్ రవిచంద్ర (97, 72 బంతుల్లో), చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ (54, 50 బంతుల్లో), మిచెల్ (59, 57 బంతుల్లో), చాంప్మన్ (65,41 బంతుల్లో), నీషమ్ (33, 21 బంతుల్లో) పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. హసన్ అలీ, అఘా సల్మాన్, వసీం జాఫర్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఉసామా మీర్ రెండు వికెట్లు తీసుకున్నాడు. కాగా పాకిస్తాన్ దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టింది.



Updated : 30 Sep 2023 2:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top