Home > క్రీడలు > ఆదుకున్న రాహుల్.. తక్కువ స్కోర్కే టీమిండియా ఆలౌట్

ఆదుకున్న రాహుల్.. తక్కువ స్కోర్కే టీమిండియా ఆలౌట్

ఆదుకున్న రాహుల్.. తక్కువ స్కోర్కే టీమిండియా ఆలౌట్
X

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులోని ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 245 రన్స్కు ఆలౌట్ అయ్యింది. ఓవర్‌నైట్‌ 208/8 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 8.4 ఓవర్లలో 37 రన్స్ చేసింది. ఇందులో 31 రన్స్ రాహుల్ చేశారు. వరుస వికెట్లు పడుతున్న రాహుల్ నిలకడగా ఆడాడు. పడిపోతున్న టీమిండియాను తన అద్భుత బ్యాటింగ్తో నిలబెట్టాడు కేఎల్ రాహుల్. వికట్లు పడుతున్నా.. క్రీజులో నిలదొక్కుకున్నాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా 208 పరుగులు చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లు రెచ్చిపోవడంతో.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుదేలయింది. 160 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.

ప్రొటీస్ బౌలర్ల దెబ్బకు ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజులో నిలబడలేకపోయారు. కగిసో రబాడా, నాండ్రే బర్గర్, మార్కో జాన్సన్ నిప్పులు చెరగడంతో.. 208 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (5, 14 బంతుల్లో), యశస్వీ జైశ్వాల్ (17, 37 బంతుల్లో) ఫెయిల్ అయ్యారు. దీంతో టీమిండియా 23 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వరుస వికెట్లు పడుతున్నా కేఎల్ రాహుల్ మాత్రం నిలకడగా ఆడి భారత్కు చెప్పుకోదగ్గ స్కోర్ను అందించాడు. ఇక సఫారీ బౌలర్లలో రబాడా 5 వికెట్లు పడగొట్టగా.. నాండ్రే బర్గర్ 3, జాన్సన్, కోయెట్జీ చెరో వికెట్ తీశారు.


Updated : 27 Dec 2023 10:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top