Test series : టీమిండియాను వదలని బ్యాడ్లక్.. మరో స్టార్ ప్లేయర్ దూరం
X
ఇంగ్లాండ్తో టీమిండియా 5 టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే రెండు టెస్టులు జరగ్గా.. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ క్రమంలో మిగితా మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ మిగితా మూడు టెస్టులకు దూరమయ్యాడు. జడేజా, కేఎల్ రాహుల్ గాయాల పాలవగా.. వాటినుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చారు. ఫామ్లో లేని శ్రేయస్ అయ్యర్ను సెలక్టర్లు పక్కనబెట్టారు. సర్ఫరాజ్ ఖాన్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్లు జట్టులోకి వచ్చారు. అంతాబాగానే ఉందనుకున్న టైంలో మరోసారి టీమిండియాకు షాక్ తగిలింది.
స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం తిరగబడింది. దీంతో అతను మిగతా మూడు మ్యాచులను దూరమైనట్లు తెలుస్తుంది. రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని అర్థం అవుతుంది. అతని స్థానంలో యువ బ్యాటర్ దేవ్ దత్ పడిక్కల్ ను జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ నెల 15 నుంచి రాజ్ కోట్ వేదికగా జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది.
భారత జట్టు : రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్/ దేవ్దత్ పడిక్కల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, కెఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్,వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్
KL Rahul out of the 3rd Test against England.
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 12, 2024
Devdutt Padikkal replaces him in the squad. (Express Sports). pic.twitter.com/wnvpgAmB2P