క్రికెట్కు గుడ్ బై.. ఆర్చరీ మొదలుపెట్టిన కేఎల్ రాహుల్
X
టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ గా అందరి దృష్టిని ఆకర్శించిన కేఎల్ రాహుల్.. వరుస గాయాలపాలై, ఫామ్ కోల్పోయి, ఇప్పుడు జట్టులో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో గాయపడిన రాహుల్.. నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, ఆసియా కప్ కు దూరం అయ్యాడు. వరల్డ్ కప్ వరకైనా కోలుకుని జట్టులోకి వస్తాడో లేదో అనేది ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ట్విట్టర్ లో రాహుల్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. అది చూసిన ఫ్యాన్స్.. రాహుల్ క్రికెట్ కు గుడ్ బై చెప్తున్నాడంటూ ప్రచారం చేస్తున్నాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
ఆ వీడియోలో రాహుల్ ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దాంతో ఫ్యాన్స్.. రాహుల్ క్రికెట్ కు వీడ్కోలు పలికి, ఆర్చర్ గా కెరీర్ ను మొదలుపెడుతున్నాడని ప్రచారం జరిగింది. దాన్ని రాహుల్ కోచ్ పూర్తిగా కొట్టిపడేశాడు. ఆ వార్తల్లో నిజం లేదని, ఎన్సీఏలో ట్రీట్మెంట్ తీసుకుంటూ.. నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడని తెలిపారు. తన ఫ్రెండ్స్ తో సరదాగా గడిపిన రాహుల్.. బోటింగ్, ఆర్చరీ, రైడింగ్ లాంటి గేమ్స్ ఆడాడు. దానికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేయగా.. అది చూసిన ఫ్యాన్స్ కంగారుపడ్డారు. ‘నా లైఫ్ లో ఇన్నిరోజులు కోల్పోయిన ఆనందం తిరిగి దక్కింది. చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో గడిపిన క్షణాలు మెమోరీస్ రూపంలో ఒక్కసారిగా గుర్తొచ్చాయి’ అంటూ ట్వీట్ కింద రాసుకొచ్చాడు.
Switched off from the usual stuff and chilled in this perfect weekend place with my boys 🤞🏻 pic.twitter.com/FprC4xVHiP
— K L Rahul (@klrahul) July 31, 2023