Home > క్రీడలు > కొత్త సెలక్టర్గా అజిత్ అగార్కర్..? కోహ్లీ, రోహిత్ ఫ్యూచర్ ఏంటి..?

కొత్త సెలక్టర్గా అజిత్ అగార్కర్..? కోహ్లీ, రోహిత్ ఫ్యూచర్ ఏంటి..?

కొత్త సెలక్టర్గా అజిత్ అగార్కర్..? కోహ్లీ, రోహిత్ ఫ్యూచర్ ఏంటి..?
X

ప్రస్తుతం బీసీసీఐ టీమిండియా భవిష్యత్తు ప్రాణాలికలపై దృష్టి పెట్టింది. రానున్న రోజుల్లో ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలు జరుగనున్నాయి. గత తొమ్మిదేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలువలేదు. దాంతో కొత్త కోచ్, కొత్త కెప్టెన్, కొత్త సెలక్టర్స్.. ఇలా అన్ని విభాగాల్లో ప్రక్షాళన మొదలుపెట్టింది బీసీసీఐ. ఇప్పటికే టీ20 పూర్తి స్థాయి కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించాలని చూస్తోంది. టీ20 ఫార్మట్ ను మొత్తం కుర్రాళ్లతో ఆడించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజం అన్నట్లు టీ20 వరల్డ్ కప్ తర్వాత నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ను టీ20 జట్టులోకి సెలక్ట్ చేయలేదు. ఎందుకని ఫ్యాన్స్ ప్రశ్నిస్తే.. సీనియర్లకు పని భారం, ఒత్తడి తగ్గించేందుకు రెస్ట్ ఇచ్చినట్లు చెప్పొకొచ్చింది.

ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్ లో భీకర ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ.. ఆసియా కప్ నుంచి టీ20 ఫార్మట్ లో 3 సెంచరీలు చేశాడు. రీహిత్, రాహుల్ స్థాయిక తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. అయితే, విరాట్ ను కచ్చితంగా టీ20లో ఆడించాలని బీసీసీఐని కోరుతున్నారు. అయితే, సీనియర్లను ఆడించాలా..? వద్దా అన్నదానిపై కొత్తగా నియమించే సెలక్టర్ల చేతిలో ఉంది. ప్రస్తుతం చీఫ్ సెలక్టర్ రేజులో మాజీ టీమిండియా బౌలర్ అజిత్‌ అగార్కర్‌ ఉన్నాడు. దాదాపు ఆయనకే కట్టబెట్టే అవకాశం కనిపిస్తుంది.

అజిత్ సెలక్టర్ పదవిలోకి రాగానే కోహ్లీ, రోహిత్ ల టీ20 భవిష్యత్తు తేలనుంది. వెస్టిండీస్ పర్యటన కోసం ఇంకా టీ20 జట్టును నియమించలేదు బీసీసీఐ. ఈ సిరీస్ తో అంతా తేలిపోతుందని కొందరు విశ్లేషకులు అంటున్న మాట. అయితే, కొందరు మాత్రం.. టీ20ల్లో సీనియర్లకు చివరి రోజులు అయిపోయాయి. రానున్న రోజుల్లో హార్దిక్ నేతృత్వంలో కుర్రాళ్ల జట్టు టీ20 ఆడుతుందని చెప్తున్నారు.

Updated : 4 July 2023 9:14 PM IST
Tags:    
Next Story
Share it
Top