Virat : మళ్లీ పేరెంట్స్ కాబోతున్న కోహ్లీ దంపతులు
X
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరమైన సంగతి తెలిసిందే. ఆయన సెలవు వెనుక కారణమేంటన్న దానిపై చర్చకు ఆర్సీబీ మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ తెరదించారు. విరాట్, అనుష్క దంపతులు త్వరలో మరో బిడ్డకు పేరెంట్స్ కానున్నరని ఆయన తెలిపారు. అందుకే ఫ్యామిలీతో గడపటం కోసం కోహ్లీ సెలవు తీసుకున్నారని ఏబీడీ తెలిపారు. విరాట్ కోహ్లీ - అనుష్క 2017 లో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ రిలేషన్ లో ఉన్న విషయంలో సోషల్ మీడియాలో పుకార్లలుగా వచ్చింది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా తమ పెళ్లి గురించి ప్రకటించారు.
వివాహం అయిన 4 సంవత్సరాల తర్వాత విరుష్క జంట కుమార్తెకు జన్మనిచ్చింది. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లి - అనుష్క జంట 2021 జనవరిలో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. మొదటి సంతానం ఆడపిల్ల. కోహ్లి- అనుష్క తమ కుమార్తెకు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ పేర్లు కలిసేలా వామిక అనే పేరు పెట్టారు. కోహి, అనుష్క ఇద్దరూ తమ గారాలపట్టిని మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. వామికను ఇప్పటి వరకు ప్రజలకు దూరంగానే ఉంచింది ఈ జంట. వామిక ముఖాన్ని చూపే ఫోటోలు ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. తమ కుమార్తెకు సంబంధించి ఏ ఫోటోను పోస్టు చేయలేదు. తమ కుతురు విషయంలో కోహ్లీ- అనుష్క చాలా గోప్యంగా ఉంచుతున్నారు. తమ బిడ్డకు అర్థం చేసుకునే పరిజ్ఞానం వచ్చి, తనే సొంతంగా ఎంపిక చేసుకునే వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు విరాట్ కోహ్లీ- అనుష్క గతంలో తెలిపారు.