Home > క్రీడలు > Virat Kohli : మిగితా టెస్టులకూ కోహ్లీ దూరం?..అందుకేనా?

Virat Kohli : మిగితా టెస్టులకూ కోహ్లీ దూరం?..అందుకేనా?

Virat Kohli  : మిగితా టెస్టులకూ కోహ్లీ దూరం?..అందుకేనా?
X

(Virat Kohli) ఇంగ్లాండ్ తో జరగబోయే మిగతా టెస్టులకూ టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లకు దూరం అయిన ఆయన...మిగిలిన 3 టెస్టులకు కూడా అందుబాటులో ఉండరని టాక్ వినిపిస్తోంది. కాగా, కోహ్లీ తల్లి సరోజ్ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆమెను దగ్గరుండి చూసుకునేందుకే విరాట్ ఈ సీరిస్ మొత్తానికి దూరమవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే వైజాగ్‌లో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఆల్‌ రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసెంట్ మ్యాచ్ లో తొడ కండరాల గాయంతో బాధపడుతున్న జడ్డూ రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆడకపోవచ్చని తెలుస్తోంది. ఈ సమయంలో కోహ్లీ రాకపోవడం టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బగానే చెప్పవచ్చు.




Updated : 31 Jan 2024 8:55 AM IST
Tags:    
Next Story
Share it
Top