Home > క్రీడలు > IND vs BAN: చివరి క్షణంలో టెన్షన్ పెట్టినా.. భారత్కు విజయాన్ని అందించి

IND vs BAN: చివరి క్షణంలో టెన్షన్ పెట్టినా.. భారత్కు విజయాన్ని అందించి

IND vs BAN: చివరి క్షణంలో టెన్షన్ పెట్టినా.. భారత్కు విజయాన్ని అందించి
X

ప్రపంచ కప్ లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణిస్తూ.. ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తూ.. వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. పుణెలో జరిగిన మ్యాచ్ లో చెలరేగిన టీమిండియా.. 7 వికెట్ల తేడాతో (8 ఓవర్లు మిగిలి ఉండగానే) బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ క్లాసీ సెంచరీతో బంగ్లాను చెడుగుడు ఆడుకున్నాడు. 97 బంతుల్లోనే 4 సిక్సర్లు, 6 ఫోర్లతో 103 పరుగులు చేశాడు. లాస్ట్ బాల్ కు 2 పరుగులు కావాల్సి ఉండగా.. కోహ్లీ సెంచరీకి ఇంకా 3 పరుగులు కావాలి.





ఈ టైంలో నజుమ్ అహ్మద్ వేసిన ఫుల్ టాస్ బంతిని.. ఫ్రంట్ ఫూట్ లో వచ్చిన కోహ్లీ లాంగ్ ఆన్ మీదుగా సిక్స్ కొట్టి, టీమిండియాకు విజయాన్ని, వన్డేల్లో తన 48వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. బంగ్లా నిర్దేశించిన 256 పరుగుల లక్ష్యాన్ని భారత్ 3 వికెట్ల కోల్పోయి.. 41.3 ఓవర్లలోనే చేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (48, 40 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్ మన్ గిల్ (53, 55 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) శుభారంభాన్ని అందించారు. తర్వాత వచ్చిన కోహ్లీ బంగ్లా బౌలర్లపై చెలరేగాడు. కేఎల్ రాహుల్ (34, 34 బంతుల్లో)తో కలిసి లక్ష్యాన్ని పూర్తిచేశాడు. బంగ్లా బౌలర్లలో మిరాజ్ రెండు వికెట్లు తీసుకోగా, హసన్ ఒక వికెట్ పడగొట్టాడు.





అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ప్లేయర్లు మేమేం తక్కువ కాదన్నట్లు బ్యాటింగ్ చేశారు. భారత బౌలింగ్ ను దాటిగా ఎదురుకుని చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. పుణెలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బంగ్లా బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఓపెనర్లు తజిద్ హసన్ (51, 43 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), లిట్టన్ దాస్ (66, 82 బంతుల్లో, 7 ఫోర్లు) మంచి స్టార్ట్ అందించారు. తర్వాత వచ్చిన బ్యాటర్లు నజ్ముల్ (8), మెహదీ హసన్ (3), తౌహిద్ హిృదయ్ (16) తక్కువ స్కోర్ కే వెనుదిరిగినా.. లోయర్ ఆర్డర్ రాణించారు. ముష్ఫికర్ రహిమ్ (38), మహ్మదుల్లా (46), చివర్లో నసుమ్ అహ్మెద్ (14) గట్టిగా పోరాడారు. దీంతో బంగ్లా 256 పరుగులకు చేరుకోగలిగింది. జడేజా, బుమ్రా, సిరాజ్ తలా రెండు వికెట్లు తీసుకోగా.. శార్దూల్, కుల్దీప్ చెరో వికెట్ తీసుకున్నారు.




Updated : 19 Oct 2023 4:24 PM GMT
Tags:    
Next Story
Share it
Top