IND vs AUS: ఆరంభం అదిరింది.. భారత్ ఘన విజయం
X
చెపాక్ లో టీమిండియా గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా.. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ నిలబడ్డాడు. క్లాసీ రాహుల్ సహకారంతో ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఆరో వికెట్ కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి మ్యాచ్ ను ఆసీస్ చేతినుంచి లాక్కున్నారు. ఆసీస్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్య చేదనలో.. ఆరంభంలోనే టీమిండియాకు షాక్ తగిలింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యార్ డకౌట్ అయి పెవిలియన్ చేరారు. దాంతో క్రీజులో పాతుకుపోయిన విరాట్ కోహ్లీ.. కేఎల్ రాహుల్ తో కలిసి స్కోర్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఒక్కో పరుగు జోడిస్తూ భారత్ ను గేమ్ లో నిలబెట్టాడు. దీంతో 200 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 41.2 ఓవర్లలో చేదించింది.
లక్ష్య చేదనంలో విరాట్ తోడందించడంతో రాహుల్ చెలరేగాడు. 115 బంతుల్లో 97 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. సెంచరీ దిశగా వెళ్తున్న విరాట్ కోహ్లీని హాజెల్ వుడ్ ఔట్ చేశాడు. 116 బంతుల్లో 85 పరుగులు చేసిన విరాట్.. ఓ చెత్త బంతికి లబుషేన్ ను క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా 8 బంతుల్లో 11 పరుగులు చేసి చేదనాన్ని త్వరగా ముగించాడు. దీంతో టీమిండియా 42 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. తొలుత ఆసీస్ బౌలర్లు భారత్ కు చెమటలు పట్టించారు. హాజెల్ వుడ్ ఒకే ఓవర్ లో రెండు వికెట్లు పడగొట్టి షాకిచ్చాడు. స్టార్క్ మరో వికెట్ తీసుకున్నాడు. తర్వాత కోలుకున్న టీమిండియా టార్గెట్ కు చేరుకుని మ్యాచ్ గెలిచింది.