Home > క్రీడలు > IND vs AFG: బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఇవాళ్టి మ్యాచ్ కాస్త స్పెషల్

IND vs AFG: బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఇవాళ్టి మ్యాచ్ కాస్త స్పెషల్

IND vs AFG: బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఇవాళ్టి మ్యాచ్ కాస్త స్పెషల్
X

ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. వ్యక్తిగత కారణాలతో మొదటి మ్యాచ్ కు దూరమైన కోహ్లీ ఈ మ్యాచ్ తో.. టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చాడు. కోహ్లీ రాకతో గిల్ ను మ్యాచ్ నుంచి తప్పించారు. తిలక్ వర్మ స్థానంలో యశస్వీ జైశ్వాల్ ను జట్టులోకి తీసుకున్నారు. దాదాపు 14 నెలల తర్వాత కోహ్లీ టీ20ల్లో రీఎంట్రీ ఇస్తుండటంతో.. అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ తో కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మట్ లో 150 పరుగులు పూర్తిచేసుకుంటాడు. కోహ్లీ మరో 35 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మట్ లో 12వేల పరుగులు పూర్తిచేసిన తొలి భారత ప్లేయర్ గా చరిత్రకెక్కుతాడు.

తుది జట్లు:

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్(c), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూకీ, నవీన్-ఉల్-జీబ్ హక్,

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేష్ శర్మ(w), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్




Updated : 14 Jan 2024 1:49 PM GMT
Tags:    
Next Story
Share it
Top