Home > క్రీడలు > తప్పుడు వార్తలు ఆపండి.. తల్లి ఆరోగ్యంపై స్పందించిన విరాట్ కోహ్లీ బ్రదర్

తప్పుడు వార్తలు ఆపండి.. తల్లి ఆరోగ్యంపై స్పందించిన విరాట్ కోహ్లీ బ్రదర్

తప్పుడు వార్తలు ఆపండి.. తల్లి ఆరోగ్యంపై స్పందించిన విరాట్ కోహ్లీ బ్రదర్
X

సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో జరుగుతున్న కీలక ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియాకు విరాట్ కోహ్లీ షాకిచ్చిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలవల్ల మొదటి రెండు టెస్టులకు అందుబాటులో ఉండనని కోహ్లీ చెప్పాడు. బీసీసీఐ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో భారత క్రికెట్ అభిమానుల్లో తీవ్ర నిరాశ మొదలైంది. కోహ్లీ స్థానంలో జట్టులోకి రజత్ పటీదార్ ను ఎంపిక చేశారు. అయినా.. గ్రౌండ్ లో కోహ్లీ మార్క్ ను క్రియేట్ చేసే వారు, బ్యాటింగ్ లో కోహ్లీలా జట్టును ఆదుకునేవారు ఎవరూలేరని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోహ్లీ తల్లి సరోజ్ కోహ్లీకి ఆరోగ్యం బాగోలేదని, ప్రస్తుతం పరిస్థితి క్రిటికల్ గా ఉందని ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

దీనిపై విరాట్ సోదరుడు వికాస్ కోస్లీ స్పందించాడు. తన తల్లి ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించాడు. ‘మా అమ్మ పూర్తి ఆరోగ్యంగా ఉంది. తనకేం కాలేదు. ఆమె ఆరోగ్య విషయంలో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అవన్నీ పుకార్లు. దయచేసి సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేయడం ఆపండ’ని వికాస్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా కోహ్లీ భర్త అనుష్క శర్మ రెండోసారి ప్రెగ్నెంట్ అయిందనే వార్తలు కూడా వస్తున్నాయి. చాలాసార్లు వీరిద్దరు కలిసి గైనకాలజీ డాక్టర్ ను కలిశారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ విషయంపై కోహ్లీ జట్టుకు దూరం అయ్యాడా? లేక ఇంకేదైనా కారణమా? అనేది తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా కోహ్లీ మూడో టెస్టుకు అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నారు.




Updated : 2 Feb 2024 9:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top