IND vs SA మ్యాచ్.. బీసీసీఐకి పోలీస్ నోటీసులు
X
కోల్ కతాలోకి ఈడెన్ గార్డెన్స్ వేదికలో నిన్ని భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించడమే కాకుండా, విరాట్ కోహ్లీ బర్త్ డే రోజు సెంచరీ చేశాడు. దాంతో ప్రపంచదేశాలను నుంచి వచ్చిన క్రికెట్ అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. వేల రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలు చేసి.. ఈ మెగా మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడటం వర్త్ అయింది అంటున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ వివాదంలో ఇరుక్కుంది. టికెట్ల విషయంలో మైదాన్ పోలీసులు బీసీసీఐకి నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.
టికెట్ల విషయంలో బ్లాక్ మార్కెట్ దందా జరిగిందని, వేల టికెట్లు డబుల్, ట్రిబుల్ రేట్లకు అమ్ముకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీకి నోటీసులు జారీ చేశారు. నిన్ని జరిగిన మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల విక్రయాలపై సమాచారం అందించాలని సూచించారు. శనివారం సాయంత్రంలోగా పత్రాలు సమర్పించాలని కోరారు. కాగా కోల్ కతా పోలీసులు ఇప్పటివరకు 19 మంది బ్యాక్ టికెట్లు అమ్మెవాళ్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 108 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ కు సంబంధించి ఏడు కేసులు నమోదు అయ్యాయి.
Kolkata Police issues notice to BCCI seeking info on ticket sales for Sunday World Cup match at Eden Gardens: Official
— Press Trust of India (@PTI_News) November 5, 2023