IND vs ENG: మేమేం భయపడలేదు.. ఇవాళ ఇంగ్లాండ్కు భయమంటే ఏంటో చూపిస్తాం
X
మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓటమిని ప్రతీకారంగా తీర్చుకున్న టీమిండియా.. రెండో టెస్టులో ఇంగ్లాండ్ పై ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. కాగా ఇవాళ విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ జట్టుకు దూరం అవడంతో.. సెలక్ట్ అయిన తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ రెండు టెస్ట్ మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ కు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్.. రెండో ఇన్నింగ్స్ లో అనూహ్యంగా చేతులెత్తేసి ఓటమి పాలయింది. దీంతో ఉప్పల్ లో భారత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. కాగా ఫస్ట్ మ్యాచ్ అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందో కేఎస్ భరత్ చెప్పుకొచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ కాస్త జాగ్రత్తపడి బరిలోకి దిగుతుందని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు.
‘మ్యాచ్ ముగిసిన తర్వాత మేమంతా డ్రెస్సింగ్ రూంలో చాలా ప్రశాంతంగా ఉన్నాం. చిత్తుగా ఓడిపోయామే.. అనుకుంటూ ఎలాంటి ఆందోళన చెందలేదు. ఎందుకంటే ఇది ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్. ఆడుతుంది భారత గడ్డపై. ఇలాంటి ఎన్నో సిరీసుల్లో టీమిండియా సత్తా చాటింది. ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. మొదటి మ్యాచ్ లో ఓడిపోయినందుకు మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. మేం భయపడుతున్నట్లు చెప్తున్నారు. మాకు భయమనేది లేదు. రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ కు భయమనేది చూపిస్తాం. ఓటమిని చూసి ఎవరూ భయపడొద్దని.. కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు. స్వేచ్చగా బ్యాటింగ్ చేయాలని సూచించారు. తొలి టెస్ట్ లో చేసిన తప్పులను సరిదిద్దుకుని ఈ మ్యాచ్ లో పుంజుకుంటా’మని భరత్ అన్నాడు. కాగా 30 ఏళ్ల భరత్ వైజాగ్ కు చెందినవాడే కావడం గమనార్హం. హోం గ్రౌండ్ లో భరత్ రెచ్చిపోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.