Home > క్రీడలు > ఆగిన గుండె.. గ్రౌండ్లో కుప్ప‌కూలిన‌ ఫుట్‌బాల‌ర్

ఆగిన గుండె.. గ్రౌండ్లో కుప్ప‌కూలిన‌ ఫుట్‌బాల‌ర్

ఆగిన గుండె.. గ్రౌండ్లో కుప్ప‌కూలిన‌ ఫుట్‌బాల‌ర్
X

లండన్ లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ప్రీమియర్ లీగ్ లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ఆడుతుండగా ల్యూటన్ టౌన్ ఫుట్ బాల్ క్లబ్ టీం కెప్టెన్ టామ్ లాక్ యర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆట రసవత్తరంగా సాగుతుండగా.. 29 ఏళ్ల లాక్ యర్ చాతి నొప్పితో కింద పడిపోయాడు. అతనలా పడిపోవడంతో షాకైన సహచర ఆటగాళ్లు.. లాక్ యర్ దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికే అతని గుండె ఆగిపోయింది. అప్ర‌మ‌త్త‌మై ఆటగాళ్లు గ్రౌండ్ సిబ్బందిని పిలవగా.. వాళ్లు లాక్ యర్‌ను స్ట్రెచ‌ర్ పై తీసుకెళ్లారు. స్టేడియంలో అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది లాక్ యర్ కు అత్యవసర చికిత్స అందింది.. సీపీఆర్ చేశారు.

దాంతో అతన్ని కాపాడగలిగారు. ఆట మొద‌లైన 65వ నిమిషంలో లాక్‌య‌ర్ గుండె ఆగిపోయింది. అప్ప‌టికీ ఇరుజ‌ట్ల స్కోర్ 1-1తో స‌మంగా ఉండగా.. ఈ ఘటన జరిగిన తర్వాత రిఫరీ మ్యాచ్ ను రద్దు చేశారు. లాక్‌య‌ర్ ను హాస్పిటల్ కు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది. లాక్‌య‌ర్ ప్రాణాలు కాపాడిన‌ వైద్య సిబ్బందికి ల్యూట‌న్ టౌన్ ఫుట్‌బాల్ క్ల‌బ్ మేనేజ్‌మెంట్ ధ‌న్య‌వాదాలు తెలిపింది. కాగా లాక్ యర్ కార్డియాక్ అరెస్ట్ కు గురవడానికి గల కారణాలన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Updated : 18 Dec 2023 10:01 PM IST
Tags:    
Next Story
Share it
Top