Home > క్రీడలు > చెస్ వరల్డ్ కప్ విజేతగా కార్ల్ సన్.. పోరాడి ఓడిన ప్రజ్ఞానంద..

చెస్ వరల్డ్ కప్ విజేతగా కార్ల్ సన్.. పోరాడి ఓడిన ప్రజ్ఞానంద..

చెస్ వరల్డ్ కప్ విజేతగా కార్ల్ సన్.. పోరాడి ఓడిన ప్రజ్ఞానంద..
X

వరల్డ్ నంబర్ వన్ చెస్ ప్లేయర్ కార్ల్ సన్ ఫిడే చెస్ వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించారు. ఇండియన్ ప్లేయర్ ప్రజ్ఞానందతో జరిగిన ఫైనల్‌లో కార్ల్‌సన్ విజేతగా నిలిచాడు. దీంతో ఛాంపియన్‌గా నిలవాలన్న ప్రజ్ఞానందకు నిరాశే ఎదురైంది. ఇవాళ జరిగిన టై బ్రేకర్‌ పోరులో ప్రజ్ఞానంద ఓడిపోయాడు. తొలిగేమ్‌లో ప్రజ్ఞానందపై కార్ల్‌సన్‌ విజయం సాధించాడు. ప్రజ్ఞానంద తప్పక గెలవాల్సిన రెండో మ్యాచ్ డ్రా అయ్యింది. దీంతో మాగ్న‌స్ కార్ల్‌సన్ ప్రపంచ విజేత‌గా నిలిచాడు.

మాగ్న‌స్ కార్ల్‌స‌న్‌కు ఇదే తొలి వ‌ర‌ల్డ్ క‌ప్ కావ‌డం గ‌మ‌నార్హం. విజేతగా నిలిచిన కార్ల్‌సన్‌ రూ. 91 లక్షలు, రన్నరప్‌ ప్రజ్ఞానంద రూ. 66 లక్షల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంటారు. గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరుకున్న భారత ఆటగాడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా ప్రపంచకప్‌లో ఫైనల్ ఆడిన అత్యంత చిన్న వయస్సు ఆటగాడిగా ప్రజ్ఞానంద్ నిలిచారు. ఫైనల్‌లో ఓడిపోయినా ప్రజ్ఞానంద్ అందరి మనసులు గెల్చుకున్నాడు. అంతకుముందు సెమీ-ఫైనల్స్‌లో జరిగిన టైబ్రేక్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో ​​కరువానాను ఓడించి ప్రజ్ఞానంద ఫైనల్‌లోకి ఎంటరయ్యాడు.



Updated : 24 Aug 2023 6:53 PM IST
Tags:    
Next Story
Share it
Top