Yuvraj Singh : యువరాజ్ సింగ్ ఇంట్లో దొంగతనం.. భారీగా క్యాష్, నగలు చోరీ
X
ఈ మధ్యకాలంలో దొంగలు సెలబ్రిటీల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. కాస్త రిస్క్ చేస్తే చాలు భారీ మొత్తంలో దోచుకోవచ్చని ఆలోచిస్తున్నారో ఏమో? వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల సౌరవ్ గంగూలీ ఇంటిని లూటీ చేసిన దొంగలు.. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంటిట్లో చోరికి పాల్పడ్డారు. భారీగా నగదు, నగలు దోచుకెళ్లారు. హరియాణా పంచ్ కులలోని యువరాజ్ ఇంటికి కన్న వేసిన దొంగలు.. రూ.75 వేల నగదుతో పాటు ఆభరణాలు దోచుకెళ్లారు. అయితే యువీ ఇంట్లీ పనిచేసే సిబ్బందే దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే ఈ చోరి జరిగింది ఇప్పుడు కాదు. గతేడాది అక్టోబర్ లో.
కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువీ తల్లి షబ్నమ్ సింగ్.. 2023 సెప్టెంబర్ లో గుర్ గావ్ లోని మరో ఇంటికి వెళ్లి, అక్టోబర్ 5న తిరిగి పంచ్ కులకు తిరిగొచ్చింది. ఆ సమయంలో దొంగతనం జరిగిందని గుర్తించింది. ఇంటి పనివారే దొంగతనం చేశారని గుర్తించిన షబ్నమ్.. వారిని పట్టుకునేందుకు ఆమే స్వయంగా రంగంలోకి దిగారు. కొంతకాలం వారిపై అనుమానం వ్యక్తం చేయగా.. ఇంతలో దీపావళి వచ్చింది. దాంతో వాళ్లు ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారు. దాంతో తన అనుమానం బలపడి వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు.. పనివాళ్లను విచారించగా అసలు విషయం బయటపడింది. వారే దొంగతనం చేశారని ఒప్పుకున్నారు.