టీ20ల్లో ఏడు వికెట్లు.. చరిత్రలో తొలి బౌలర్గా రికార్డ్
X
టీ20 చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికి సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేశాడు మలేషియా యువ పేస్ బౌలర్ సియాజ్రుల్ ఇద్రుస్. ఆసియా రీజనల్ క్వాలిఫయర్స్ లో ఈ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే మ్యాచ్ లో ఏడు వికెట్లు తీసిన తొలి బౌలర్ గా నిలిచాడు. చైనాతో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన ఇద్రుస్.. ఏడు వికెట్లు పడగొట్టి కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చాడు. అందులో ఒక ఓవర్ మెయిడెన్ కూడా చేశాడు. ఇద్రుస్ దెబ్బకు చైనా 11.2 ఓవర్లలో 23 పరుగులకే ఆలౌట్ అయింది. 24 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా 4.5 ఓవర్లలో టార్గెన్ కు చేరుకుంది.
ఇప్పటి వరకు జరిగిన టీ20 మ్యాచుల్లో ప్రపంచ వ్యాప్తంగా 12 మంది బౌలర్లు ఆరు వికెట్లు తీసుకున్నారు. ఏడు వికెట్లు తీసిన బౌలర్ గా ఇద్రుస్ చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా చరిత్రలో అతి తక్కువ స్కోరు నమోదు చేసిన మూడో జట్టుగా చైనా నిలిచింది. చైనా ఇన్నింగ్స్ లో ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోర్ నమోదు చేయలేదు. ఆరుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. అంతేకాకుండా ఇద్రుస్ తీసిన వికెట్లన్నీ క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. కాగా, క్వాలిఫయర్స్ లో విజేతగా నిలిచే జట్టు ఆసియా రీజనల్ ఫైనల్ కు చేరుకుంటుంది. టాప్ 2లో నిలిచిన జట్లు వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కు అర్హత సాధిస్తుంది.
4-1-8-7. 😲
— FanCode (@FanCode) July 26, 2023
First 7-wicket haul in T20I cricket history!
Idrus clean-bowls China.#Cricket #T20WCQualifier pic.twitter.com/ZbGfm1mouR