Home > క్రీడలు > IPL Auction 2024: ఎవరీ మల్లికా సాగర్..? ఐపీఎల్‌ తొలి మహిళా ఆక్షనీర్ గురించి మీకు తెలుసా..!

IPL Auction 2024: ఎవరీ మల్లికా సాగర్..? ఐపీఎల్‌ తొలి మహిళా ఆక్షనీర్ గురించి మీకు తెలుసా..!

IPL Auction 2024: ఎవరీ మల్లికా సాగర్..? ఐపీఎల్‌ తొలి మహిళా ఆక్షనీర్ గురించి మీకు తెలుసా..!
X

ఐపీఎల్ ఆక్షన్ కు.. ఈ తాతకు (హ్యూ ఎడ్మీడ్స్) విడదీయలేని అనుభందం ఉంది. కేవలం తన కోసమే ఐపీఎల్ ఆక్షన్ ను చూసేవారూ ఉంటారు. అంత ఫేమస్ అతను. అయితే ఈసారి ఐపీఎల్ ఆక్షన్ లో హ్యూ ఎడ్మీడ్స్ ను మిస్ అవుతున్నారు అభిమానులు. అతని స్థానంలో మల్లిక సాగర్ ను ఐపీఎల్ మేనేజ్మెంట్ భర్తీ చేసింది. గత ఐపీఎల్ ఆక్షన్ సమయంలో హ్యూ ఎడ్మీడ్స్ స్పృహ కోల్పోయి కిందపడ్డాడు. కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఆక్షన్ కు దూరం అయ్యాడు. అతని స్థానంలో చారు శర్మ ఆక్షన్ ను కొనసాగించాడు. కాగా ఈ సీజన్ ఆక్షన్ ను కొనసాగించాలని మల్లిక సాగర్ ను నియమించింది బీసీసీఐ. ఇక అప్పటి నుంచి క్రికెట్ అభిమానులు మల్లిక సాగర్ గురించి నెట్ లో తెగ వెతుకుతున్నారు.

ముంబైకి చెందిన 48 ఏళ్ల మల్లిక సాగర్.. మోడ్రన్ అండ్ కాన్ టెంపరరీ ఇండియన్ ఆర్ట్ అనే కంపెనీలో ఆర్ట్ కలెక్టర్ గా పనిచేస్తోంది. ఆమెకు ఆక్షన్ నిర్వహించిన అనుభవం కూడా ఉంది. గత 20 ఏళ్లుగా వేలం నిర్వాహకురాలిగా పనిచేస్తున్న మల్లిక. 2021 ప్రో కబడ్డీ లీగ్ వేలం, తర్వాత WPL వేలం కూడా మల్లికనే నిర్వహించింది. ఆక్షనీర్ గా తన కేరీర్ ను 2001లో మొదలుపెట్టింది. తొలిసారి క్రిస్టీస్ ఆక్షన్ హౌస్ లో వేలం నిర్వాహకురాలిగా నడిపించింది. కాగా రేపు (డిసెంబర్ 19) దుబాయ్ వేదికగా జరగబోయే ఐపీఎల్ వేలంలో భారత్ తో సహా 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. 10 టీమ్స్ లో కలిసి మొత్తం 77 ఖాళీలు మాత్రమే ఉన్నాయి.

Updated : 19 Dec 2023 10:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top