షాక్లో టీమిండియా.. మరో సీనియర్ బ్యాట్స్మెన్ రాజీనామా
X
టీమిండియాకు వరుసపెట్టి క్రికెటర్లు రాజీనామా ప్రకటిస్తున్నారు. మొన్న తెలుగుతేజం అంబటి రాయుడు, ఇవాళ మనోత్ తివారి.. ఇలా ఒక్కరొక్కరు రాజీనామా చేస్తున్నారు. జట్టులో పోటీ పెరగడం, కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తుండే సరికి.. వరుసపెట్టి సీనియర్ బ్యాటర్లు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్, వెస్ట్ బెంగాల్ మినిస్టర్ మనోత్ తివారి క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల క్రికెట్ ఫార్మట్ ల నుంచి తప్పుకుంటున్నట్లు తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. ‘క్రికెట్ కు ఇక గుడ్ బై. ఈ ఆట నాకు అన్నీ ఇచ్చింది. ఈ విషయంలో నేనెప్పుడూ దేవుడికి కృతజ్ఞతతో ఉంటా. నాకు సపోర్ట్ ఇచ్చిన.. నా ప్రయాణంలో తోర్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
తివారి 2015లో టీమిండియాకు చివరిసారి ఆడాడు. హజారేలో జింబాంబ్వే తరుపున ఆడిందే ఆఖరిది. తన దేశవాళి చివరి మ్యాచ్ ను ఫిబ్రవరిలో ఆడాడు. 2008లో ఆస్ట్రేలియా తరుపున అరంగేట్రం చేసిన తివారి.. 2015 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన తివారి..12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లు ఆడాడు. వన్డేల్లో 287 పరుగులు, టీ20ల్లో 15 పరుగులు చేశాడు. అంతేకాకుండా వన్డేలో 5 వికెట్లు కూడా ఉన్నాయి. ఐపీఎల్ లో 98 మ్యాచ్ లు ఆడి.. 7 హాఫ్ సెంచరీలతో 1695 పరుగులు చేశాడు.