Home > క్రీడలు > టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం...రిటైర్మెంట్ వెనక్కి !

టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం...రిటైర్మెంట్ వెనక్కి !

టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం...రిటైర్మెంట్ వెనక్కి !
X

టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ రిటైర్మెంట్ పై పునరాలోచనలో పడ్డాడు. ఇటీవల ఆటకు వీడ్కోలు పలుకుతున్న ప్రకటించిన తివారి మళ్లీ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆగస్టు 3వ తేదీన అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మనోజ్ తివారి వెల్లడించాడు. ఇన్‌‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ విషయాన్ని తెలిపాడు.‘‘క్రికెట్ ఆటకు గుడ్‌బై. ఈ ఆట నాకు అన్ని ఇచ్చింది. క్రికెట్‌కు, నా పక్షాన ఎప్పుడూ ఉండే దేవునికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. నా క్రికెట్ ప్రయాణంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యావాదాలు తెలియజేస్తున్నాను. నా బాల్యం నుంచి గత సంవత్సరం వరకు నా క్రికెట్ విజయాల్లో భాగస్వామ్యమైన నా కోచ్‌లందరికీ ధన్యవాదాలు. మనబేంద్ర ఘోష్, కోచ్ లాంటి మా నాన్నగారు క్రికెట్ ప్రయాణంలో నాకు మూలస్తంభం. మా నాన్న, అమ్మకు ధన్యవాదాలు. వారు నన్ను క్రికెట్‌లో కొనసాగమని ప్రోత్సహించారు. నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ నా పక్షాన నిలిచిన నా భార్య సుస్మితకి ధన్యవాదాలు. నా సహచర ఆటగాళ్లకు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇక్కడ నేను ఎవరినైనా ప్రస్తావించకపోయినట్లైతే దయచేసి నన్ను క్షమించగలరు.’’ అని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తివారి భావోధ్వేగ పోస్ట్ చేశాడు. అయితే ఇంతలోనే తన నిర్ణయాన్ని మార్చుకుని క్రికెట్ లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు.

మనోజ్ తివారి రిటైర్మెంట్ ప్రకటన వెనక్కు తీసుకోవడం వెనుక బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ చైర్మన్ స్నేహసిన్ గంగూలీ ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లపాటు జట్టులో కొనసాగమని తివారిని క్యాబ్ ప్రెసిడెంట్ గంగూలీ కోరినట్లు సమాచారం. అతనితో రెండు గంటల పాటు చర్చించన తర్వాత తివారి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్నుగా బెంగాల్ జట్టులో కీలక ఆటగాడిగా మనోజ్ కొనసాగుతున్నాడు.

మనోజ్ తివారి అంతర్జాతీయ క్రికెట్ లో 2008 నుంచి 2015 మధ్య భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మెత్తం తన కెరీర్ లో 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లు భారత్ తరఫున ఆడాడు. వన్డేల్లో 287 పరుగులు చేయగా, టీ20ల్లో 15 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ లో 98 మ్యాచ్ లాడిన తివారీ 1695 పరుగులు రాబట్టాడు. ఇందులో 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో తివారీ ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్‌కతానైడ్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.భారత జట్టుకు చివరగా 2015లో ప్రాతినిధ్యం వహించాడు. హరారే వేదికగా జింబాబ్వేతో ఆడినదే తన అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచ్. తర్వాత డమెస్టిక్ క్రికెట్ లో కొనసాగుతున్నాడు. క్రికెట్ తో పాటు రాజకీయాల్లోనూ తివారీ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ప్రస్తుతం బెంగాల్ క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.





Updated : 8 Aug 2023 2:51 PM IST
Tags:    
Next Story
Share it
Top