వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత వొండ్రుసోవా
X
ప్రతిష్టాత్మక వింబుల్డన్ మహిళల గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి వొండ్రుసోవా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో టునీషియాకు చెందిన ఒన్స్ జబీర్‌పై 6-4, 6-4 పాయింట్ల తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. 24 ఏళ్ల వొండ్రుసోవాకు ఇదే మొదటి వింబుల్డన్ ట్రోఫీ. వింబుల్డన్ చరిత్రలో 60 ఏళ్ల తర్వాత చాంపియన్‌గా అవతరించిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. కెరీర్‌లో ఆడిన రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోనే టైటిల్ గెలిచి రికార్డు సృష్టించింది.
ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఫైనల్ పోరులో ఓటమి చవిచూసిన జాబెర్ కు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. 28 ఏళ్ల జబర్ గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. వింబుల్డన్ విన్నర్‌కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు) ప్రైజ్‌మనీ, రన్నరప్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కనుంది.