Aiden Markram: లంకపై సౌతాఫ్రికా విధ్వంసం.. మార్క్రమ్ వరల్డ్ రికార్డ్
X
సౌతాఫ్రికా ఆటగాళ్లు కసితో ఉన్నారు. ఈసారి ఎలాగైనా కప్పుకొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇన్నేళ్ల నిరీక్షణకు ఈసారి ఎలాగైనా తెరదించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే భారత్ లో జరుతున్న వరల్డ్ కప్ కోసం భారీ వ్యూహాలతో వచ్చారు. హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగి.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఢిల్లీ వేదికపై శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ముగ్గురు సౌతాఫ్రికా బ్యాటర్లు శ్రీలంక బౌలర్లపై రెచ్చిపోయి సెంచరీలు చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. వన్డే మ్యాచ్ ను టీ20 తరహాలో ఆడి.. విధ్వంసం సృష్టించారు. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్లు.. లంక బౌలర్లను ఊచకోత కోశారు.
ఓపెనర్, కెప్టెన్ బవుమా (8) ఫెయిల్ అయినా.. మ్యాచ్ ఏ మాత్రం లంక చేతుల్లోకి వెళ్లలేదు. మరో ఓపెనర్ డికాక్ (100, 84 బంతుల్లో), మూడో వికెట్ లో వచ్చిన వాన్ డెర్ డస్సెన్ (108, 110 బంతుల్లో)తో కలిసి స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. మూడో వికెట్ కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మార్క్రమ్ శ్రీలంకపై విధ్వంసం సృష్టించాడు. 3 సిక్సర్లు, 14 ఫోర్లతో కేవలం 54 బంతుల్లోనే 106 పరుగులు రాబట్టాడు. దీంతో వన్డే వరల్ కప్ లో వేగంగా సెంచరీ (49 బంతుల్లో) చేసిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. లోయర్ ఆర్డర్ లో వచ్చిన క్లసెన్ (32, 20 బంతుల్లో), మిల్లర్ (39, 21 బంతుల్లో) చెలరేగడంతో సౌతాఫ్రికా 428 పరుగుల భారీ స్కోరు చేసింది. లంక బౌలర్లలో దసున్ శనక (6 ఎకానమీ) తప్ప మిగిలిన ప్రతీ బౌలర్ భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. మదుశనక 2 వికెట్లు పడగొట్టగా.. రజిత, పతిరన, వెల్లలగే తలా ఓ వికెట్ తీసుకున్నారు.