Home > క్రీడలు > Glenn Maxwell: మ్యాక్స్వెల్ మ్యాడ్ ఇన్నింగ్స్.. డబుల్ షోతో సెమీస్కు

Glenn Maxwell: మ్యాక్స్వెల్ మ్యాడ్ ఇన్నింగ్స్.. డబుల్ షోతో సెమీస్కు

Glenn Maxwell: మ్యాక్స్వెల్ మ్యాడ్ ఇన్నింగ్స్.. డబుల్ షోతో సెమీస్కు
X

విధ్వంసం, విశ్వరూపం, అరాచకం.. ఇలా ఓ పదం అంటూ పెట్టలేం నిన్నిటి మ్యాక్ వెల్ ఇన్నింగ్స్ కు. ఒంటి చేత్తో.. అహ కాదు కాదు.. ఒంటి కాలితో నిలబడి ఆస్ట్రేలియాను గెలిపించాడు. నువ్వు మనిషివా.. మ్యాక్స్ వెల్ వా అని అనిపించుకున్నాడు. బ్యాట్ తో కాదు ఓ మంత్ర దండంతో ఆడి.. ఓడిపోతున్న జట్టును ఒక్కడై గెలిపించాడు. ఇలా అతని ఇన్నింగ్స్ గురించి ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే.. చరిత్రలో ఇలాంటి పోరాటాలు జరిగేది చాలా తక్కువ. అలాంటిది పోరాటాల్లో మొదటి వరుసలో ఉంటుంది ఈ ఇన్నింగ్స్. నిన్నటి మ్యాచ్ మిస్ అయిన ప్రతీ క్రికెట్ అభిమాని.. తనను తాను తిట్టుకుంటాడు. క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయిన ఓ సూపర్ షోను మిస్ అయ్యామే అని బాధపడతారు. డబుల్ ధమాకా అందించి.. ఆసీస్ ను సెమీస్ కు తీసుకెళ్లాడు.

96/7.. ఇది ఐదు సార్ల వరల్డ్ చాంపియన్స్ పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ షాక్ ఇవ్వడం ఖాయం. సెమీస్ లోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించడం ఖాయం అని అనుకున్నారంతా. కానీ అప్పుడే మొదలైంది మ్యాక్స్ వెల్ ఆట. 24, 33 పరుగుల వద్ద లైఫ్ వచ్చినా.. తోటి ఆటగాళ్లు పెవిలియన్ కు క్యూ కట్టినా.. గాయం తిరగబడి క్రీజులో నిల్చోలేని పరిస్థితి ఏర్పడినా.. ఏ మాత్రం జంకకుండా బ్యాటింగ్ చేశాడు. ఓ విధ్వంసాన్ని సృష్టించి ఆసీస్ ను గెలిపించాడు. 292 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఇక ఇంటికి పోవడమే అనుకున్నారంతా. 46/6.. 96/7.. మ్యాచ్ చేజారిపోయే పరిస్థితి నుంచి తప్పించుకుని కేవలం 47 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించారు. దీనంతటికి కారణం మ్యాక్స్ వెల్. 6 వికెట్ లో వచ్చిన మ్యాక్సీ.. పరుగుల వరద పారించాడు. 10 సిక్సర్లు, 21 ఫోర్లతో.. 128 బంతుల్లోనే 201 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. మొదటి 50 పరుగులు 51 బంతుల్లో పూర్తి చేసిన మ్యాక్సీ.. తర్వాత విధ్వసాన్ని మొదలుపెట్టాడు. గాయం తిరగబడి నడవలేని పరిస్థితిలో వికెట్ కు అడ్డంగా నిలబడి.. ఒంటి కాలితో బ్యాటింగ్ చేశాడు. సింగిల్స్ లేవమ్మా.. అన్నీ సిక్సులు, ఫోర్లే అంటూ పరుగుల ప్రవాహాన్ని సృష్టించాడు.

వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసీస్ బ్యాటర్, వన్డే చేజింగ్ లో అత్యదిక వ్యక్తిగత స్కోర్, నాన్ ఓపెనర్ గా డబుల్ సెంచరీ, 5 వికెట్ తర్వాత అత్యధిక సెంచరీలు.. చేసిన బ్యాటర్ గా సరికొత్త రికార్డ్ ను తన పేరిట రాసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ కూడా పోరాడింది. ఇబ్రహీం జద్రాన్ (129, 143 బంతుల్లో), రషిద్ ఖాన్ (35, 18 బంతుల్లో).. సూపర్ ఇన్నింగ్స్ తో ఆసీస్ బౌలర్లను ఉతికారేసి 291 పరుగుల భారీ స్కోర్ చేసింది.




Updated : 8 Nov 2023 8:17 AM IST
Tags:    
Next Story
Share it
Top