టీమిండియాపై ప్రపంచ రికార్డ్ సృష్టించిన ఐర్లాండ్ ప్లేయర్
X
ఐర్లాండ్ వర్సెస్ టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఏడు వికెట్లు నష్టపోయి 139 పరుగులు చేసింది. అయితే ఐర్లాండ్ ఈ స్కోరు చేయడంలో ఆ జట్టు బ్యాటర్ బారీ మెక్‌కార్తీ అద్భుత హాఫ్ సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 59 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన బారీ మెక్‌కార్తీ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.అంతే కాకుండా ఆఖరి ఓవర్ చివరి బంతికి సిక్సర్ కొట్టి 33 బంతుల్లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
ఈ హాఫ్ సెంచరీతో, బారీ మెక్‌కార్తీ టీ20 క్రికెట్‌లో 7 కంటే తక్కువ క్రమంలో టీమిండియాపై అత్యధిక పరుగులు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహరాజ్ పేరిట ఉండేది. 2022లో కేశవ్ మహారాజ్ టీమ్ ఇండియాపై 8వ స్థానంలో 41 పరుగులు చేశాడు. ఇది ఇప్పటివరకు అత్యధిక స్కోరు. ఇప్పుడు బారీ మెక్‌కార్తీ ఈ రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు. అలాగే, బౌలర్ల క్రమంలో టీమిండియాపై టీ20 క్రికెట్‌లో హాఫ్ సెంచరీ సాధించిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు.
ఇక ఈరోజు రెండో మ్యాచ్ ప్రారంభంకానుంది. వర్షం వల్ల తొలి మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయి డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించిన టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది ఐర్లాండ్ . ఫస్ట్ మ్యాచ్‌లో మెయిన్ బ్యాటర్లు ఫెయిల్ అవ్వడంతో కాస్త ఇబ్బంది పడ్డా.. రెండో మ్యాచ్‌లో మాత్రం భారత్‌కు కాస్త గట్టిగానే సమధానం చెప్పాలనుకుంటోంది. ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌లోనూ లిటిల్, యంగ్, క్యాంఫర్ ఆ జట్టుకు ఎంతో కీలకమైన ప్లేయర్లు. ఇప్పుడీ రెండో మ్యాచ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. ఈరోజు జరగబోయే మ్యాచ్‌లో ఇరు జట్ల నుంచి గట్టి పోటీని ఆశించవచ్చు.