జులై 13 నుంచి మినీ ఐపీఎల్.. టైటిల్ వేటలో CSK, KKR, MI, Delhi
X
ఫ్రాంచేజీ లీగ్స్ లేవని బాధ పడేవాళ్లకు గుడ్ న్యూస్. ఫ్యాన్స్ ను అలరించేందుకు మరో క్రేజీ టీ20 లీగ్ రాబోతోంది. మినీ ఐపీఎల్ కు రంగం సిద్ధం అయింది. అమెరికా వేదికగా జులై 13 నుంచి మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ప్రారంభం కానుంది. మొత్తం 17 రోజుల పాటు అభిమానులను అలరించే ఈ మినీ మెగా లీగ్.. జులై 30న ముగుస్తుంది. ఈ లీగ్ లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి.
నాలుగు టీంలను ఐపీఎల్ ఫ్రాంచేజీలు.. ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్ కతా కొనుగోలు చేయగా.. మిగిలిన ఫ్రాంచేజీలను కూడా భారత సంతతి వ్యక్తులే దక్కించుకున్నారు. వాంషింగ్టన్ ఫ్రీడమ్ పేరుతో వాషింగ్టన్ డీసీ ఫ్రాంచేజీ సంజయ్ గోవిల్ కొనుగోలు చేశాడు. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టును శాన్ ఫ్రాస్కిస్కోకు చెందిన ఆనంద్ రాజరామన్, వెంకీ హరినారాయణ్ లు దక్కించుకున్నారు.
ఈ మినీ మోగా లీగ్ లో కూడా అంతర్జాతీయ ఆటగాళ్లు కనిపించనున్నారు. జేసన్ రాయ్, మార్కస్ స్టోయినిస్, ఆన్రిచ్ నోర్జ్, వనిందు హసరంగ ఆరోన్ ఫించ్, క్వింటన్ డికాక్, మిచెల్ మార్ష్ తో పాటు మరికొందరు ప్లేయర్లు ఈ టోర్నీలో అలరించనున్నారు. ఈ టోర్కీకి షెడ్యూల్ ను కూడా ప్రకటించారు.
టోర్నోలో పాల్గొనే 6 జట్లు:
* ఎంఐ న్యూయార్క్ (ముంబై ఇండియన్స్)
* టెక్సాస్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్)
* లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ (కోల్ కతా నైట్ రైడర్స్)
* సియాటెల్ ఆర్కాస్ (ఢిల్లీ క్యాపిటల్స్)
* శాన్ ఫ్రాన్కిస్కో యూనికార్న్స్
* వాషింగ్టన్ ఫ్రీడమ్
షెడ్యూల్ : జులై 13న తొలి లీగ్ మ్యాచ్ టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ మధ్య జరుగనుంది.