Home > క్రీడలు > పాట్ కమ్మిన్స్ను వెనక్కి నెట్టి.. రికార్డ్ ధర పలికిన మిచెల్ స్టార్క్

పాట్ కమ్మిన్స్ను వెనక్కి నెట్టి.. రికార్డ్ ధర పలికిన మిచెల్ స్టార్క్

పాట్ కమ్మిన్స్ను వెనక్కి నెట్టి.. రికార్డ్ ధర పలికిన మిచెల్ స్టార్క్
X

ఐపీఎల్ 2024 మినీ వేలం కొనసాగుతోంది. దుబాయ్‌లోని కోకోకోలా ఎరెనా వేదికగా మంగళవారం మధ్యాహ్నం 1:00 గంట నుంచి వేలం ప్రక్రియ మొదలైంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 స్లాట్‌లు కోసం పోటీపడుతున్నాయి. ఇందులో 30 వరకు విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు ఉన్నాయి. మొత్తం 333 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. రెండు రౌండ్లు ముగిశాయి. మొదటి సెట్ పాల్గొన్న ఆటగాళ్లలో మొత్తం 12 మందిని ఫ్రాంచైజీలు సొంతం చేసుకోగా.. నలుగురు ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలారు. కాగా మూడో రౌండ్ లోనూ ఆసీస్ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. వరల్డ్ కప్ విన్నర్స్ పాట్ కమ్మిన్స్ రూ.20 కోట్లు, ట్రావిస్ హెడ్ రూ.6.80 కోట్లకు సన్ రైజర్స్ సొంతం చేసుకుంది.

కాగా మూడో రౌండ్ లో వేలంలోకి వచ్చిన మిచెల్ స్టార్క్ కూడా రికార్డ్ ధర పలికాడు. పాట్ కమ్మిన్స్ ను వెనక్కి నెట్టి చరిత్ర సృ‌ష్టించాడు. మిచెల్ స్టార్క్ ను 24.75 కోట్లకు కోలకతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ తో బరిలో దిగిన స్టార్క్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరి వరకు గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య హోరాహోరీగా సాగిన వేలంపాటలో.. ఐపీఎల్ చరిత్రను తిరగరాసింది.

Updated : 19 Dec 2023 4:17 PM IST
Tags:    
Next Story
Share it
Top