Siraj: శ్రీలంకకు చావు దెబ్బ.. నిప్పులు చెరిగిన హైదరబాదీ పేసర్
X
ఆటకు పనిరాడు అన్నారు. బౌలింగ్ లో పస లేదని విమర్శించాడు. బౌలింగ్ లో రన్ మెషిన్ అని వెక్కిరించారు. టీంలోకి ఎలా వచ్చాడని తీసిపారేశారు. ఆటో డ్రైవర్ కొడుకు ఇక్కడి వరకు రావడం చాలా ఎక్కువ, ఆడించింది చాలు.. ఇక టీంలో నుంచి తీసి పారేయండని ఎగతాళి చేశారు. కట్ చేస్తే.. అలా వేలెత్తి వెక్కిరించిన ప్రతీ వాళ్లు నోరు మూసుకునేలా కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఐసీసీ ఓడీఐ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ప్లేస్ సాధించాడు. టీ20, వన్డే, టెస్ట్ క్రికెట్ లో జాతీయ జట్టుకు కీ ప్లేయర్ అయ్యాడు. కీలక సమయాల్లో జట్టును ఆదుకుంటూ.. మిగతా బౌలర్లు ఫెయిల్ అవుతున్నా, వెన్నెముకలా నిలిచాడు. ఐపీఎల్ ఆర్సీబీ జట్టుకు మెయిన్ బౌలర్ అయి.. లాయల్ ఫ్యాన్స్ ను సంపాధించుకున్నాడు. ఇప్పుడు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో ఒకే ఓవర్లో 4 వికెట్లు పడగొట్టి శ్రీలంకను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశాడు.
చదువుతుంటూనే అర్థం అయి ఉంటుంది. అతనెవరో కాదు మహమ్మద్ సిరాజ్. కొలంబో వేదికపై శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో నిప్పులు చెరుగుతున్నాడు. 4వ ఓవర్ వేసిన సిరాజ్ ఆ ఓవర్ లో ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. నిశంక, కుశాల్ మెండీస్, సధీర, చరిత్ అసలంక, ది సిల్వ, దనుష్ శనక... మొత్తం 6 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా ఓ వికెట్ తీసుకున్నాడు. దాంతో లంక 12 ఓవర్లలో 39 పరుగులకు 6 కీలక వికెట్లు కోల్పోయింది. భారత్ తరుపున వేగంగా ఐదు వికెట్లు పడగొట్టిన (16 బంతుల్లో) బౌలర్ గా రికార్డ్ కెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ శ్రీలంక ఆటగాడు చమిందవాస్ పేరిట ఉండేది. అతను కూడా 16 బంతుల్లోనే 5 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం లంక పరిస్థితి చూస్తుంటే.. భారీ స్కోర్ చేయడం కష్టమయ్యే అవకాశం ఉంది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. 6 ఏళ్ల నిరీక్షనకు ఈసారి తెరపడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.