Home > క్రీడలు > ఆ అవార్డు ఒక కల.. మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ అవార్డు ఒక కల.. మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ అవార్డు ఒక కల.. మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు
X

టీమిండియా వరల్డ్ కప్ హీరో మహ్మద్ షమీకి ఇటీవలే అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అతడు ఈ అవార్డు అందుకోనున్నాడు. ఈ క్రమంలో అవార్డుపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రెండో అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడం ప్రతీ క్రీడాకారుడి కల అని చెప్పారు. తన కల నిజమైందని సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘ ఈ అవార్డు దక్కడం పట్ల ఎంతో గర్వపడుతున్నాను. చాలా మంది క్రీడాకారులు ఈ అవార్డు కోసం ఎదురుచూస్తారు. కానీ కొంతమందికే ఇది దక్కుతుంది. చాలా మందికి జీవితకాలం గడిచిపోయినా ఈ అవార్డు నెరవేరని కలగా మిగిలిపోతుంది’’ అని షమీ అన్నాడు.

గాయం కారణంగా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు షమీ దూరమయ్యాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నాడు. స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు సైతం అతడు దూరమయ్యే అవకాశలున్నాయి. 5 టెస్టుల సరీస్ లో భాగంగా తొలి రెండు టెస్టులకు షమీ దూరమయ్యే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఇంకా బౌలింగ్ చేయడం ప్రారంభించని షమీ.. ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంది. అయితే గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నట్లు తెలిపిన షమీ.. త్వరగా జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

Updated : 9 Jan 2024 2:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top