షమీకి అర్జున అవార్డ్.. నిజామాబాద్ బాక్సర్కు కూడా..!
X
దేశంలో క్రీడాకారులకు అందజేసే జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023 ఏడాదికి గాను కేంద్ర యువజన సర్వీస్లు, క్రీడల మంత్రిత్వ శాఖ ఇవాళ (డిసెంబర్ 20) మధ్యాహ్నం అవార్డుల జాబితాను విడుదల చేసింది. టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీకి అర్జున అవార్డు ప్రకటించింది. షమీతోపాటు వివిధ ఆటల్లో ప్రతిభ కనబరిచిన మరో 26 మందికి జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. కాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన టీమిండియా అంధుల క్రికెట్ కెప్టెన్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి కూడా అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు. షమీతో పాటు మరో 25 మందికి అర్జున అవార్డ్ ను అందించనున్నారు. పవన్ కుమార్ (కబడ్డీ), సునీల్ కుమార్ (రెజ్లింగ్), వైశాలి (చెస్) అవార్డుకు ఎంపికయ్యారు. నిజామాబాద్ కు చెందిన బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్ కూడా అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు. త్వరలో వీరికి రాష్ట్రపతి ఈ అవార్డ్ అందిస్తారు.
ద్రోణాచార్య అవార్డులు:
లలిత్ కుమార్- రెజ్లింగ్
ఆర్.బి. రమేశ్ – చెస్
మహవీర్ ప్రసాద్ సైని – పారా అథ్లెటిక్స్
శివేంద్ర సింగ్ – హాకీ
గణేష్ ప్రభాకర్ – మల్లఖంబ్
ధ్యాన్ చంద్ లైఫ్ టైం అచీవ్మెంట్స్ అవార్డ్:
మంజూష కన్వర్ – బ్యాడ్మింటన్
వినీత్ కుమార్ శర్మ – హాకీ
కవితా సెల్వరాజ్ – కబడ్డీ