Home > క్రీడలు > IND vs SA live score: బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. అశ్విన్ ఔట్

IND vs SA live score: బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. అశ్విన్ ఔట్

IND vs SA live score: బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. అశ్విన్ ఔట్
X

రెండో టెస్టులో నెగ్గి సిరీస్ ను సమం చేయాలని చూస్తుంది టీమిండియా. కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ బౌలర్లు చెలరేగిపోతున్నారు. పేస్ అటాక్ తో సౌతాఫ్రికాకు చుక్కలు చూపిస్తున్నారు. కట్టుదిట్టంగా బంతులు వేస్తూ సౌతాఫ్రికాను అడ్డుకుంటున్నారు. రెచ్చిపోయిన మహ్మద్ సిరాజ్.. 3 వికెట్లు పడగొట్టాడు. గత మ్యాచ్ లో సెంచరీ హీరో, కెప్టెన్ డీన్ ఎల్గర్ (4)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఐడెన్ మార్క్రమ్ ను (2) స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. టోనీ డి జోర్జీ (2)ని కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో.. 11 పరుగులకే సౌతాఫ్రికా 3 కీలక వికెట్లు కోల్పోయింది. బుమ్రా కూడా ఒక వికెట్ పడగొట్టాడు. ట్రిస్టన్ స్టబ్స్ (3) రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 29/4 తో కష్టాల్లో ఉంది.

కాగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ అశ్విన్ బదులు జడేజాను జట్టులోకి తీసుకుంది. శార్ధూల్ ఠాకూర్ బదులు ముకేశ్ కుమార్ ను ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఎల్గర్ ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ, ముకేశ్‌ కుమార్‌

దక్షిణాఫ్రికా: డీన్‌ ఎల్గర్ (కెప్టెన్), ఐదెన్ మార్‌క్రమ్, టోనీ డిజోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్‌ బెడింగ్‌హామ్‌, కైల్‌ వెర్రీన్నె (వికెట్ కీపర్), మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, నాండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి

Updated : 3 Jan 2024 2:51 PM IST
Tags:    
Next Story
Share it
Top