Home > క్రీడలు > వన్డే సిరీస్‌ ముందు భారత్‌కు ఎదురు దెబ్బ...

వన్డే సిరీస్‌ ముందు భారత్‌కు ఎదురు దెబ్బ...

వన్డే సిరీస్‌ ముందు భారత్‌కు ఎదురు దెబ్బ...
X

వెస్టిండీస్ టూర్‌లో వన్డే సమరానికి భారత్ సిద్ధమైంది. వరల్డ్ కప్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌‌ ఎంతో కీలకం. రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్‌ను 1-0తో దక్కించుకున్న భారత్..వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. గురువారం రాత్రి 7 గంటలకు భారత్ -వెస్టిండీస్ మధ్య మొదటి వన్డే ప్రారంభం కానుంది.

అయితే ఈ సిరీస్ కు ముందు భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెస్టిండీస్ టూర్ నుంచి భారత్ పేసర్ మహ్మద్ సిరాజ్ వైదొలిగాడు. చీలమండ గాయాతో అతడు తిరిగి ఇంటికి పయనమయ్యాడు. ఆసియా కప్, వరల్డ్ కప్ ముంగిట రిస్క్ తీసుకోవద్దని సిరాజ్‌కు జాగ్రత్తగా విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ సూచించింది.

రెండో టెస్ట్ లో ఐదు వికెట్లతో చెలరేగిన సిరాజ్ ఈ సిరీస్ కు దూరం కావడం టీమిండియాకు పెద్ద లోటనే చెప్పాలి. ప్రస్తుతం వన్డేల్లో అత్యుత్తమ బౌలర్స్‌లో సిరాజ్ ఒకడిగా ఉన్నాడు. 2022 నుంచి అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. బుమ్రా, షమీ అందుబాటులో లేకపోవడంతో భారత పేస్ బృందాన్ని సిరాజ్‌ నడిపించాడు. సిరాజ్ స్థానంలో మరో ఆటగాడిని భారత్ ఎంపిక చేయలేదు. భారత్ బౌలింగ్ దళంలో ప్రస్తుతం జయదేవ్ ఉనద్కత్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్ తో పాటు మొదటి ఎంపికైన ముఖేష్ కుమార్‌లు ఉన్నారు.

భారత్ జట్టు ..

రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, సంజు శాంసన్‌/ ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌/కుల్‌దీప్‌, శార్దూల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌/ముకేశ్‌ కుమార్‌.


Updated : 27 July 2023 4:11 PM IST
Tags:    
Next Story
Share it
Top