Home > క్రీడలు > పాకిస్తాన్ నుంచి ధోనీకి ఆహ్వానం.. ఎందుకో తెలుసా..?

పాకిస్తాన్ నుంచి ధోనీకి ఆహ్వానం.. ఎందుకో తెలుసా..?

పాకిస్తాన్ నుంచి ధోనీకి ఆహ్వానం.. ఎందుకో తెలుసా..?
X

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి భారత్ లోనే కాదు.. ప్రపంచ దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. తన ఆట తీరు, వ్యక్తిత్వానికి.. అంతా ధోనీని ఇష్టపడుతుంటారు. ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం పలుకుతుంటారు. ఈ క్రమంలో ధోనీకి పాకిస్తాన్ ను ఆహ్వానం అందింది. ఎందుకో తెలుసా..? ధోనీ కెరీర్ లో ఎన్నో మ్యాచుల్లో గెలిచాడు. భారత్ కు టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రీఫీ అందించాడు. తన సుధీర్ఘ కెరీర్ లో ధోనీ.. 2006-08 సంవత్సరాల్లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడి రకరకాల ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేశాడు.

ఈ క్రమంలో పాక్ లో తిన్న ఫుడ్ తనకెంతో నచ్చిందని, మళ్లీ ఓసారి తినాలనుందని ధోనీ చెప్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన పాక్ స్పోర్ట్స్ యాంకర్ ఫఖర్ ఆలం ధోనీకి ఓ సలహా ఇచ్చాడు. కేవలం క్రికెట్ ఆడేందుకే కాకుండా.. నచ్చిన ఫుడ్ తినేందుకు కూడా పాకిస్తాన్ కు రావాలని ధోనీని ఆహ్వానించాడు. పాక్ ఫుడ్ పై ధోనీకి ఉన్న ఇష్టానికి.. ఆయన ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించాడు.




Updated : 30 Dec 2023 9:35 PM IST
Tags:    
Next Story
Share it
Top