Home > క్రీడలు > AFG, INDIA : రెచ్చిపోయిన ఆఫ్ఘాన్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

AFG, INDIA : రెచ్చిపోయిన ఆఫ్ఘాన్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

AFG, INDIA : రెచ్చిపోయిన ఆఫ్ఘాన్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
X

రెండో టీ20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు రెచ్చిపోయారు. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆఫ్ఘాన్ 172 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వచ్చిన ప్రతీ బ్యాటర్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ రహ్మానుల్లా (14, 9 బంతుల్లో), నబీ (14), నజీబుల్లా (23) రాణించారు. గుల్బాద్దీన్ నైబ్ (57) పరుగులతో సత్తా చాటాడు. చివర్లో కరీం జనత్ (20, 10 బంతుల్లో), ముజీబ్ ఉర్ రహ్మాన్ (21, 9 బంతుల్లో) చెలరేగారు. దీంతో ఆఫ్ఘాన్ స్కోర్ 172 పరుగులు చేరుకుంది. మరో ఓపెనర్ ఇబ్రహీం (8), అజ్మతుల్లా (2) నిరాశ పరిచారు. కాగా టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా.. రవీ బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబెకు ఒక వికెట్ దక్కింది.




Updated : 14 Jan 2024 8:52 PM IST
Tags:    
Next Story
Share it
Top