Home > క్రీడలు > IPL 2024: అందుకే రోహిత్‌ను కాదని హార్దిక్‌కు కెప్టెన్సీ ఇచ్చాం.. అసలు విషయం చెప్పేసిన MI హెడ్‌ కోచ్

IPL 2024: అందుకే రోహిత్‌ను కాదని హార్దిక్‌కు కెప్టెన్సీ ఇచ్చాం.. అసలు విషయం చెప్పేసిన MI హెడ్‌ కోచ్

IPL 2024: అందుకే రోహిత్‌ను కాదని హార్దిక్‌కు కెప్టెన్సీ ఇచ్చాం.. అసలు విషయం చెప్పేసిన MI హెడ్‌ కోచ్
X

ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను.. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి ముంబైకి మారి.. అనూహ్యంగా కెప్టెన్సీని అందుకున్నాడు. తనకు కెప్టెన్సీ ఇస్తేనే ముంబైకి వస్తానని ఫ్రాంచైజీతో పాండ్యా అంతర్గత ఒప్పందాలు జరిపినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఐదుసార్లు చాంపియన్ గా నిలబెట్టిన వ్యక్తి.. హార్దిక్ సారథ్యంలో ఆడాలా అని అభిమానుల్లో తెలియని అసంతృప్తి నెలకొంది. ఇవన్నీ ఒక ఎత్తైతే.. ఈ ఇద్దరి మధ్య ఇగో సమస్యలు తలెత్తాయని, రోహిత్ ఈ ఐపీఎల్ లో ముంబైకి దూరంగా ఉండి, వచ్చే సీజన్ లో వేరే ఫ్రాంచైజీకి ఆడతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన ఏ వార్త నిజం అనేది.. ఎవరిలో క్లారిటీ లేదు. తాజాగా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్‌ బౌచర్‌ స్పందిస్తూ.. కెప్టెన్ మార్పు వెనుక అసలు కారణాన్ని చెప్పుకొచ్చాడు.

‘కెప్టెన్సీ మార్పు అనేది పూర్తిగా ఆట పరంగా తీసుకున్న నిర్ణయమే. జట్టులో పరివర్తనం చేసేందుకు తీసుకున్న మార్పే ఇది. ఒక ప్లేయర్‌గా హార్దిక్‌ని తిరిగి జట్టులోకి తీసుకోవడం కోసం మేము ట్రేడ్ విండో చేశాం. చాలామందికి ఈ విషయం అర్థం కాక.. భావోద్వేగానికి గురయ్యారు. కానీ ఆటకు సంబంధించిన విషయాల్లో ఇలాంటి నిర్ణయాలు పక్కనబెట్టాలి. ఈ నిర్ణయం.. రోహిత్ ను ఒక ప్లేయర్‌గా అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు సాయం చేస్తుంది. ఇన్నాళ్లు కెప్టెన్సీ ఒత్తిడిలో ఉన్న రోహిత్.. ఇకపై ఓ ప్లేయర్ గా పూర్తి స్వేచ్చగా ఆడుతాడు. గత రెండు సీజన్స్ లో చూసుకుంటే రోహిత్ కెప్టెన్సీ ఒత్తడిలో సరిగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. తన భుజాలపై ఉన్న బాధ్యతలను తగ్గించేందుకు కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని మార్క్ స్పష్టం చేశాడు.

Updated : 6 Feb 2024 5:45 PM IST
Tags:    
Next Story
Share it
Top