Home > క్రీడలు > RohitSharma : రోహిత్ను తప్పించిన ముంబై.. గంటలోనే ఊహించని షాక్..

RohitSharma : రోహిత్ను తప్పించిన ముంబై.. గంటలోనే ఊహించని షాక్..

RohitSharma  : రోహిత్ను తప్పించిన ముంబై.. గంటలోనే ఊహించని షాక్..
X

రోహిత్ శర్మ ఫ్యాన్స్కు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ షాకిచ్చింది. ఐదు సార్లు ఐపీఎల్ కప్పులు అందించిన రోహిత్ను పక్కనబెట్టి.. హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అందించింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్కు ఊహించని షాక్ తగిలింది. పాండ్యా పేరును ప్రకటించిన వెంటనే ముంబై ఇండియన్స్ అఫీషియల్ ‘ఎక్స్’ పేజీని 4 లక్షల మంది అన్‌ఫాలో చేశారు. దీంతో గంటలోనే పెద్ద సంఖ్యలో ఫాలోయర్లను టీం కోల్పోయింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని కొంతమంది ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వారంతా అన్ఫాలో అయి తమ నిరసనను తెలియజేస్తున్నారు.

కాగా గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ట్రేడింగ్లో దక్కించుకుంది. 2022లో గుజరాత్ను గెలిపించిన హార్దిక్.. 2023 సీజన్లో జట్టును ఫైనల్స్కు తీసుకెళ్లాడు. ఇప్పుడు అతడికే జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ నిర్ణయంతో ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా రోహిత్ శర్మ 2013 నుంచి ఈ ఏడాది సీజన్ 2023 వరకు ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. రికార్డు స్థాయిలో 5 సార్లు జట్టుకు కప్ అందించాడు. మరోవైపు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేందుకే జట్టులో మార్పులు చేసినట్లు ముంబై ఇండియన్స్ వివరణ ఇచ్చింది. సచిన్ టెండూల్కర్ నుంచి హర్భజన్ వరకు, రికీ పాంటింగ్ నుంచి రోహిత్ వరకు అసాధారణమైన నాయకత్వాన్ని అందించారని కొనియాడింది.


Updated : 16 Dec 2023 10:56 AM IST
Tags:    
Next Story
Share it
Top