Home > క్రీడలు > Asian Games 2023: దేశానికే కీర్తి తెచ్చిన తెలుగు అమ్మాయిలు

Asian Games 2023: దేశానికే కీర్తి తెచ్చిన తెలుగు అమ్మాయిలు

Asian Games 2023: దేశానికే కీర్తి తెచ్చిన తెలుగు అమ్మాయిలు
X

చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు సత్తా చాటారు. తెలంగాణలోని సంగారెడ్డి గురుకుల విద్యార్థిని.. అగసర నందిని, ఏపీలోని విశాఖకు చెందిన జ్యోతి యర్రాజి లు భారత్‌కు పతకాలు తెచ్చి పెట్టారు. హెప్టాథ్లాన్​ విభాగంలో అగసర నందిని కాంస్య పతకాన్ని సాధించగా... 100 మీటర్ల హర్డిల్స్​లో జ్యోతి యర్రాజి.. రజత పతకం గెలుచుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్​లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణి అగసర నందిని.. హెప్టాథ్లాన్‌లో కాంస్య పతకాన్ని సాధించారు. సంగారెడ్డిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలో బీబీఏ రెండో సంవత్సరం విద్యనభ్యసిస్తున్న నందిని.. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ అథ్లెటిక్స్ అకాడమీ మొదటి బ్యాచ్ విద్యార్థిని కావడం విశేషం. ఆమె తండ్రి ఎల్లయ్య చాయ్​ అమ్ముతూ కూతురిని గురుకుల పాఠశాలలో చేర్పించారు. నందిని ఆసియా క్రీడాల్లో కాంస్య పతకం సాధించడం పట్ల రాష్ట్ర సంక్షేమశాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, టీఎస్డబ్ల్యూఆర్​ఈఐఎస్ సెక్రటరీ డాక్టర్ నవీన్ నికోలస్, గురుకుల విద్యా సంస్థల సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

మరోవైపు ఏపీలోని విశాఖకు చెందిన తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి 100 మీటర్ల హర్డిల్స్​లో రజత పతకం గెలుచుకున్నారు. ఆమె తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డ్‌, తల్లి కుమారి ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో క్లీనర్‌గా పనిచేస్తోంది. అయితే ఆమె పాల్గొన్న పోటీలో విచిత్రం చోటు చేసుకుంది. ఆమెకు మొదట 100 మీటర్ల హర్డిల్స్​లో కాంస్య పతకం దక్కగా.. ఆ తర్వాత దాన్ని సిల్వర్​ మెడల్​కు మార్చారు. స్వర్ణ పతకమే లక్ష్యంగా రేసులోకి బరిలోకి దిగిన ఈ ఆంధ్రా అమ్మాయి చైనా కుయుక్తులకు బలైపోయింది. అథ్లెట్లందరూ రేసు కోసం తమ మార్క్‌లో ఉండగా.. గన్‌షాట్‌కు ముందే ముందే, చైనా రేసర్ యాని వు పరుగు ప్రారంభించింది. ఆమెను చూసి పక్కనే ఉన్న జ్యోతి కూడా పొరపాటు పడి జ్యోతి కూడా పరుగు ప్రారంభించింది. దీనిని అథ్లెటిక్స్‌లో ఫాల్స్ స్టార్ట్ అంటారు . అలా చేయడం వల్ల సదరు అథ్లెట్లను రేస్‌ నుంచి తప్పిస్తారు. ఈ రేస్‌లోనూ అధికారులు వెంటనే ఇద్దరు రేసర్లను అనర్హులుగా ప్రకటించారు. అయితే ఇద్దరు అథ్లెట్లు నిరసనకు దిగారు. ఆ సమయంలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలోని అథ్లెట్స్ కమీషన్ హెడ్, వెటరన్ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్ కూడా అక్కడే ఉన్నారు. జ్యోతికి మద్దతుగా మాట్లాడారు. దీంతో మ్యాచ్‌ నిర్వాహకులు రీప్లేలు చూసి యానివు మొదట పరుగు ప్రారంభించినట్లు తేల్చారు. వెంటనే ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. అదే సమయంలో జ్యోతి ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారించారు. దీంంతో రేసులో మూడోస్థానంలో నిలిచిన ఆమెకు రజత పతకం అందించారు.

Updated : 2 Oct 2023 8:08 AM IST
Tags:    
Next Story
Share it
Top