Home > క్రీడలు > విరాట్‌తో గొడవపై మరోసారి స్పందించిన నవీన్ ఉల్ హక్

విరాట్‌తో గొడవపై మరోసారి స్పందించిన నవీన్ ఉల్ హక్

విరాట్‌తో గొడవపై మరోసారి స్పందించిన నవీన్ ఉల్ హక్
X

ఐపీఎల్ 2023లో ఆర్సీబీ ప్లేయర్ విరాట్ - లక్నో ఆటగాడు నవీన్ ఉల్ హక్ గొడవ గురించి తెలిసిందే. మైదానంలో మాటల యుద్దానికి దిగిన వీరు..మ్యాచ్ ముగిశాక మరోసారి కలబడ్డారు. వీరి గొడవ మధ్యలో గంభీర్ ఎంట్రీ ఇచ్చి రచ్చ లేపాడు. ఈ విషయంపై ఇంకా చర్చ కొనసాగుతునే ఉంది. కోహ్లీతో వివాదంపై మరోసారి నవీన్ హుల్ హక్ స్పందించాడు.

తనది ఏం తప్పు లేదని విరాటే మొదట గొడవ స్టార్ట్ చేశాడని తెలిపాడు. బీబీసీ పాస్టోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ" మ్యాచ్ సమయంలో అతడే మాటలు అన్నాడు. నేను గొడవ మొదలు పెట్టలేదు. మ్యాచ్ తర్వాత మళ్లీ తన నోటికి పనిచెప్పాడు. షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే సమయంలో ఏదో అనడం ప్రారంభించాడు. మ్యాచ్ ఫీజులో ఫైన్‍లను గమనిస్తే గొడవ ఎవరు ప్రారంభించారో అర్థమవుతుంది.నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. నేను సాధారణంగా స్లెడ్జ్ చేయను. ఆ మ్యాచ్‍లో నేను ఒక్క మాట కూడా అనలేదు. నేను ఎవరినీ స్లెడ్జ్ చేయలేదు. నేను ఆ రోజు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నానో అక్కడ ఉన్న ప్లేయర్లకు తెలుసు" అని నవీన్ తెలిపాడు. ఈ గొడవతో విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 100 శాతం ఫైన్ పడింది. నవీన్ ఉల్ హక్‍కు 50 శాతం జరిమానా పడింది. ఈ గొడవ అనంతరం కూడా నవీన్ హుల్ హక్ పరోక్షంగా విరాట్‌పై ట్వీట్స్ పెట్టాడు. విరాట్ ఔటైన సమయంలో మ్యాంగోస్ పేరుతో ట్వీట్ చేసి..కోమ్లీ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు.


Updated : 15 Jun 2023 10:06 PM IST
Tags:    
Next Story
Share it
Top