IND vs NEP: శభాష్.. అనిపించిన నేపాల్ బ్యాటర్లు.. టీమిండియాకు ఎంతంటే?
X
పల్లెకెలె వేదికపై టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో నేపాల్ బ్యాటర్లు శభాష్ అనిపించారు. భీకర భారత బౌలర్లను సమిష్టిగా ఎదుర్కొని క్రీజులో నిలబడ్డారు. దీంతో 48.2 ఓవర్లలో నేపాల్ 230 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు కుశాల్ (38, 25 బంతుల్లో), ఆసిఫ్ (58, 97 బంతుల్లో) పదో ఓవర్ల వరకు నిలబడి భారత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ పరుగులు రాబట్టారు. దీంతో ఒత్తిడిని అదిగమించిన టీమిండియా వెంట వెంటనే వికెట్లు తీసింది.
ఓపెనర్ల పార్ట్ నర్షిప్ ను శార్దూల్ బ్రేక్ చేయడా.. తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు భిమ్ షర్కి (7), రోహిత్ (5), కుశాల్ మల్ల (2)ను జడేజా బోల్తా కొట్టించాడు. దీంతో నేపాల్ కష్టాల్లో పడింది. ఓపెనర్ ఆసిఫ ఆరభం నుంచి నెమ్మదిగా ఆడుతూనే స్కోర్ బోర్డ్ ను ముందుకు తీసుకెళ్లాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గుల్షన్ (23, 35 బంతుల్లో), దీపేందర్ సింగ్ (29, 25 బంతుల్లో), సోంపాల్ కామి (48, 56 బంతుల్లో) రాణించారు. దీంతో నేపాల్ 230 పరుగుల మైలు రాయికి చేరుకోగలిగింది. భారత బౌలర్లలో సిరాజ్, జడేజా 3 వికెట్లు తీసుకోగా.. షమీ, శార్దూల్, హార్దిక్ చెరో వికెట్ పడగొట్టారు. కుల్దీప్ యాదవ్ 3 ఎకానమీతో ఆకట్టుకున్నాడు.