SA vs NED : పరువు పోగొట్టుకున్న సౌతాఫ్రికా.. చిత్తుగా ఓడిపోయి
X
నిన్న ఆఫ్ఘనిస్తాన్.. నేడు నెదర్లాండ్స్.. ప్రత్యర్థికి చుక్కలు చూపించాయి. ముందు ఎంత పెద్ద జట్టున్నా.. క్రీజులో ఉంది భీకర బ్యాటర్ అయినా తమ పోరాటపటిమ ముందు ఎవరైనా తల వంచాల్సిందేనని సాటిచెప్పారు. ధర్మశాలలో సౌతాఫ్రికతో జరిగిన మ్యాచ్ లో సత్తా చాటిన నెదర్లాండ్స్.. చరిత్రలో భారీ విజయాన్ని నమోదు చేసింది. సౌతాఫ్రికాను చిత్తు చేసి.. 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 43 ఓవర్లలో (ఓవర్ల కుదింపు) 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఎడ్వర్డ్ (78) రన్స్ తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 207 పరుగులకే కుప్పకూలింది.
నెదర్లాండ్స్ బౌలర్ల దూకుడు ముందు చాపచుట్టేసింది. డేవిడ్ మిల్లర్ (43, 52 బంతుల్లో) మినహా.. ఏ ఒక్కరు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. బవుమా (16), డికాక్ (20), రూసో (4), మార్క్రమ్ (1) దారుణంగా విఫలం అయ్యారు. క్లసెన్ (28) గెరాల్డ్ (22) ఎక్కవ సేపు క్రీజులో నిలువలేకపోయారు. నెదర్లాండ్స్ బౌలర్లు నిప్పులు చెరుగుతూ బౌలింగ్ చేయగా.. ఏ సౌతాఫ్రికా బ్యాటర్ వాటిని ఎదురుకునేందుకు ప్రయత్నం చేయలేకపోయారు. చివర్లో కేషవ్ మహరాజ్ (40) కాసేపు ఆశలు రేకెత్తించినా.. ఫలితం లేకపోయింది. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్, పాల్ వాన్, రోలోఫ్, బాస్ డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కోలిన్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ గెలుపుతో నెదర్లాండ్స్ క్రికెట్ చరిత్రలో గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది.